కోవిషీల్డ్ , #కోవాక్సిన్ లలో ఏది ఉత్తమమైనది....?

కోవిషీల్డ్ , #కోవాక్సిన్ లలో ఏది ఉత్తమమైనది....? 


కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు దేశ వ్యాప్తంగా జనవరి 16, 2021న వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ప్రస్తుతం మన దేశంలో కోవిషీల్డ్, కోవాక్సిన్ అనే రెండు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. మార్చి 4వ తేదీ వరకు దాదాపు 1.8 కోట్ల మంది ఫ్రంట్ లైన్ వర్కర్లు, హెల్త్ కేర్ వర్కర్లకు వ్యాక్సినేషన్ ఇచ్చారు. మార్చి 1నుంచి ప్రైవేట్ కేంద్రాల్లోనూ వ్యాక్సినేషన్ అందుబాటులోకి వచ్చింది. రాబోయే రోజుల్లో ఈ రెండు వ్యాక్సిన్లలో ఏది ఉత్తమమైనదన్న సందేహాలున్నపుడు ఈ  విషయాలు గుర్తించి నిర్ణయం తీసుకోవచ్చు. 


*కోవిషీల్డ్:* 

కోవిషీల్డ్ ఒక వైరల్ వెక్టర్ టీకా. చింపాంజీలలో బలహీనపడిన సాధారణ జలుబు వైరస్‌ (అడెనోవైరస్) SARS-CoV-2 యొక్క స్పైక్ ప్రోటీన్ యొక్క జన్యు పదార్థాన్ని తీసుకుని ఈ వ్యాక్సీన్‌ను అభివృద్ధి చేశారు.  


*కోవాక్సిన్:* 

SARS-CoV-2 (స్ట్రెయిన్: NIV-2020-770) వైరస్‌నుంచి తయారైంది. దీన్ని శరీరంలోకి పంపడం ద్వారా రోగ నిరోధక వ్యవస్థను యాక్టివేట్‌ చేసి కరోనా వైరస్‌పై దాడి చేసేలా ప్రేరేపించేలా కోవాక్సిన్‌ పని చేస్తుంది. ఇందులో ప్రోటీన్లు చెక్కుచెదరకుండా ఉంటాయి. తద్వారా అవి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి.


*కోవిషీల్డ్, కోవాక్సిన్లలో ఉండే రసాయన పదార్థాలు:*


*కోవిషీల్డ్:*

* ఎల్-హిస్టిడిన్ ఇథనాల్

* ఎల్-హిస్టిడిన్ హైడ్రోక్లోరైడ్ మోనోహైడ్రేట్

* మెగ్నీషియం క్లోరైడ్ హెక్సాహైడ్రేట్

* పాలిసోర్బేట్ 80 *

* సుక్రోజ్

* సోడియం క్లోరైడ్

* డిసోడియం ఎడెటేట్ డైహైడ్రేట్ (EDTA)

* ఇంజెక్షన్ కోసం నీరు


*కోవాక్సిన్:*

* అల్యూమినియం హైడ్రాక్సైడ్ జెల్

* ఇమిడాజోక్వినోలినోన్ # (టిఎల్ఆర్ 7/8 అగోనిస్ట్)

* 2-ఫెనాక్సిథెనాల్

* ఫాస్ఫేట్ బఫర్ సెలైన్


*నిల్వ ఉంచే పరిస్థితులు:*

రెండు వ్యాక్సిన్లను 2 నుండి 8 డిగ్రీల సెల్సియస్ వద్ద నిల్వ చేయడంతోపాటు రవాణా చేయవచ్చు


*ఎన్ని డోసులు వేసుకోవాలి:*


*కోవిషీల్డ్:*

12 వారాల వ్యవధిలో రెండు డోసులుగా ఈ వ్యాక్సీన్‌ను ఇస్తారు. అయితే మన దేశానికి చెందిన డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) రెండు డోసుల మధ్య వ్యవధి 4 వారాలు సరిపోతుందని సూచించింది.


*కోవాక్సిన్:*

కోవాక్సిన్ కూడా రెండు డోసుల మధ్య కాలవ్యవధి 4 వారాలు ఉంటే సరిపోతుంది.


*రెండు వ్యాక్సిన్లలో ఏది సమర్థవంతమైనది:*

ది ల్యాన్సెట్ సర్వే ప్రకారం కోవీషీల్డ్ వ్యాక్సిన్ 4 వారాల వ్యవధిలో 2 డోసులు పూర్తి చేసుకున్నట్టయితే దాదాపు 70శాతం సమర్థవంతంగా పనిచేస్తోందని గుర్తించారు. 3 దేశాల్లో కోవీషీల్డ్ ట్రైల్స్ లో భాగంగా 11,636 మంది పేషెంట్లపై 3 ట్రైల్స్ సింగిల్ బ్లైండ్ గాను మరొకటి డబుల్ బ్లైండ్ ట్రైల్స్ చేశారు. రెండు డోసులు పూర్తయిన 12 వారాల గ్యాప్ తర్వాత దాని సమర్థత  82.4శాతం ఉన్నట్టు గుర్తించారు. 


*కోవాక్సిన్:*

  

ఫేజ్-3 ట్రైల్స్ లో కోవ్యాక్సిన్ 81శాతం సమర్థవంతంగా పనిచేస్తుందని ప్రకటించారు. వ్యాక్సిన్ ట్రైల్స్ లో భాగంగా భారత్ లో 28,500 మందిపై డబుల్ బ్లైండ్ ట్రైల్స్ నిర్వహించారు. కోవీషీల్డ్ వ్యాక్సిన్ కంటే #కోవాక్సిన్ ఎక్కువ సమర్థవంతంగా పనిచేస్తున్నట్టు గుర్తించారు. 


*సమ్మతి*

 

*కోవిషీల్డ్‌:*

3వ దశ క్లినికల్ ట్రయల్స్ కూడా పూర్తి చేసినందున కోవిషీల్డ్‌కు సమ్మతి పత్రం అవసరం లేదు.


*కోవాక్సిన్:*

మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు అందుబాటులోకి రాక ముందే ఇండియన్ రెగ్యులేటరీ అథారిటీ కోవాక్సిన్ కు అనుమతి ఇచ్చింది.  


*వ్యాక్సిన్ ధర*

వ్యాక్సిన్లను ప్రభుత్వ సంస్థల్లో ఉచితంగా అందిస్తారు. ప్రైవేట్ సంస్థల్లో మాత్రం వ్యాక్సిన్ ధర 250 రూపాయలుగా నిర్ణయించారు. ప్రస్తుతం వ్యాక్సిన్ ఏది వేసుకోవాలన్నది ప్రజలు నిర్ణయించుకునే అవకాశం లేదు. కానీ ప్రైవేట్ సంస్థల్లోనూ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినపుడు మాత్రం నచ్చిన వ్యాక్సిన్ వేసుకునే అవకాశం ఉంటుంది. 


*సూచనలు:*

ఆక్స్ ఫోర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనికా, సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా తయారు చేసిన కోవీషీల్డ్ వ్యాక్సిన్ కు ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే అందుబాటులో ఉన్న సమాచారం, దాని లక్షణాలు, గుణాలను పరిశీలించిన తర్వాత కోవాక్సిన్ కూడా  మంచిదని సిఫార్సు చేస్తున్నారు. 


వైద్యుల పర్యవేక్షణలో పై రెంటిలో ఏది తీసుకున్నా కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా రెసిస్టెన్స్ పవర్ ఇస్తాయి.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top