జేఎన్‌టీయూ తయారుచేసిన ప్రశ్నాపత్రాలు వాడాల్సిందే

అమరావతి: విద్యారంగంలో ఏపీ సీఎం జగన్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అటానమస్‌ కళాశాలల్లో నిర్వహించే పరీక్షల విధానంలో మార్పులు చేయాలని సీఎం ఆదేశించారు.


తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. సొంతంగా ప్రశ్నాపత్రాలు తయారుచేసే విధానాన్ని రద్దు చేస్తున్నట్లు చెప్పారు. జేఎన్‌టీయూ తయారుచేసిన ప్రశ్నాపత్రాలు ఆయా కళాశాల్లో వినియోగించాలని సూచించారు.


నాన్‌ అటానమస్‌ కళాశాలలకూ ఇవే ప్రశ్నాపత్రాలు ఉంటాయన్నారు. పేపర్‌ వాల్యుయేషన్‌ కూడా జేఎన్‌టీయూకే అప్పగించాలని సీఎం నిర్ణయించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ విద్యార్థి డిగ్రీ సాధించాక ఉద్యోగం వచ్చే పరిస్థితి ఉండాలని.. నైపుణ్యం లేకుంటే ముఖాముఖి పరీక్ష కూడా ఎదుర్కోలేమని చెప్పారు

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top