U DISE INFO 30నుంచి మే 20 వరకు విద్యాశాఖ లెక్కలు యూడైస్ షెడ్యూల్ రిలీజ్

U DISE INFO

30నుంచి మే 20 వరకు విద్యాశాఖ లెక్కలు

యూడైస్ షెడ్యూల్ రిలీజ్

రాష్ట్రంలో 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించిన లెక్కలు చేసేందుకు యూడైస్ షెడ్యూల్ ను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవ సేన శనివారం రిలీజ్ చేశారు. ఈ నెల 30 నుంచి మే 20లోపు ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయాలని డీఈఓలకు సూచించారు. ఈ సందర్భంగా స్టూడెంట్లు, టీచర్ల వివరాలతోపాటు బడుల్లోని ఫెసిలిటీస్ వివరాలు సేకరించనున్నారు. వీటి ఆధారం గానే కేంద్రం నిధులు రిలీజ్ చేస్తుంది. ఈ నెల 30, 31వ తేదీల్లో స్కూళ్ల అప్ గ్రేడ్, క్లోజ్, మెర్జ్ తదితర వివరాల సేకరణ చేయనున్నారు. ఏప్రిల్ 15,16వ తేదీల్లో జిల్లా ఎంఐఎస్ కోఆ ర్దినేటర్లు, ఏపీవోలతో స్టేట్ లెవెల్ వర్క్ షాప్ ఉంటుంది. ఏప్రిల్ 27 నుంచి 30 వరకు హెద్మాస్టర్లు డేటాను పూర్తి చేయాల్సి ఉంటుంది

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top