కరోనా రెండో దశ లక్షణాలు ఇవే

 గతంలో కరోనా బాధితులకు జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు, తలనొప్పి వచ్చేవి.వాసన, రుచి గుర్తించలేకపోవడం, శ్వాస సంబంధిత సమస్యలు వంటివి కనిపించేవి. అప్పట్లో చాలా మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోగా రెండో దశలో మాత్రం వైరస్‌ సోకినవారిలో లక్షణాలు కనిపిస్తున్నాయి. కళ్లు లేత గులాబీ రంగులోకి మారడం, జీర్ణాశయ సంబంధ సమస్యలు, కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, కండరాల నొప్పులు, శ్వాస సరిగా ఆడకపోవడం, చికాకు వంటివి కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top