ఈ ఏడాది విద్యాసంవత్సరం పూర్తయినట్లే : మంత్రి సురేశ్ గారు

 రాష్ట్రంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు సెలవులు ప్రకటించింది. రేపటి నుంచి సెలవులు ఇస్తున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో పరిస్థితులపై ఉన్నతాధికారులతో సీఎం జగన్‌ సమీక్ష అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ప్రకటించారు. టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు ప్రస్తుతానికి యథాతథంగానే జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులు నష్టపోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పరీక్షల రద్దుతో గతేడాది మిలిటరీ ఉద్యోగార్థులు నష్టపోయారన్నారు.



పాఠశాలల్లో ఇప్పటి వరకు కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించామని మంత్రి చెప్పారు.

పరీక్షల నిర్వహణ సమయంలోనూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. 1 నుంచి 9 తరగతి విద్యార్థులకు ఇక ఎలాంటి పరీక్షలు ఉండవని.. ఈ ఏడాది విద్యాసంవత్సరం పూర్తయినట్లు మంత్రి సురేశ్‌ స్పష్టం చేశారు.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top