టెన్త్ పరీక్షలు నిర్వహించకుంటే విద్యార్థుల భవిష్యత్‌కే నష్టమని ఏపీ సీఎం జగన్ పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్ గురించి తన కంటే ఎవరూ ఎక్కువగా ఆలోచించరన్నారు. పరీక్షలు నిర్వహించకుండా సర్టిఫికెట్లలో కేవలం పాస్ అని ఇస్తే.. భవిష్యత్‌లో విద్యార్థులు నష్టపోతారన్నారు. పరీక్షలు నిర్వహించాలో వద్దో కేంద్రం రాష్ట్రాలకే వదిలేసిందని జగన్ పేర్కొన్నారు. పాస్ సర్టిఫికెట్లతో విద్యార్థులకు మంచి సంస్థల్లో సీట్లు వస్తాయా? అని ప్రశ్నించారు. టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై విమర్శలు చేస్తున్నారని జగన్ వాపోయారు. విపత్కర పరిస్థితుల్లో అగ్గిపెట్టాలని చూస్తున్నారన్నారు. పరీక్షల నిర్వహణకు అన్ని రాష్ట్రాల్లో ఒకే విధానం లేదన్నారు. పరీక్షలు రద్దు చేయాలని అడగడం సులభమే.. కానీ విద్యార్థులకే నష్టమని జగన్ పేర్కొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)


Learn a Word September 2022 Schedule
0 comments:
Post a Comment