టీచర్లకు కరోనా.. స్కూళ్లే కారణం కాదు!: పాఠశాల విద్యాశాఖ

పాఠశాలల నిర్వహణ వల్లే టీచర్లు కొవిడ్‌ బారిన పడ్డారని దుష్ప్రచారం చేయడం తగదని పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ వి.చినవీరభద్రుడు అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసమే టీచర్లు సహా అందరం పనిచేస్తున్నామన్న విషయాన్ని గ్రహించాలన్నారు. పదో తరగతి పరీక్షలకు వ్యవధి ఉన్నందున అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో సైన్స్‌ పార్క్‌/మ్యూజియంలను ఏర్పాటు చేయననున్నామని, దీనికిగాను తొలి విడతగా రూ.25 లక్షల చొప్పున కేటాయించామని తెలిపారు. 

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top