Covid 19: కరోనాతో రిటైర్డ్‌ హెడ్‌ మాస్టర్‌ కోటయ్య మృతి

 కరోనాతో రిటైర్డ్‌ హెడ్‌ మాస్టర్‌ కోటయ్య మృతి చెందారు. వారం రోజుల నుంచి నెల్లూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి ఆయన మరణించారు. కోట మండలం తిన్నెలపొడికి చెందిన కోటయ్య.. ఆనందయ్య మందుతో కోలుకున్నానన్న వీడియోతో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. కంట్లో చుక్కలు వేసుకున్న వారం రోజులకు కోటయ్య ఆరోగ్యం క్షీణించగా, కోట ప్రభుత్వాసుపత్రిలో ఆయన చేరారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం 22న నెల్లూరు జీజీహెచ్‌కి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కోటయ్య మృతి చెందారు.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top