Raithubharosa Status: ప్రభుత్వం మరో సంక్షేమ పథకం అమలు చేసేందుకు సిద్ధమైంది. ఖరీఫ్ సీజన్ కు ముందే రైతులకు పెట్టుబడి సాయం అందించందుకు వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంబించనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా 52.38 లక్షల మంది రైతులకు రూ.3,882.23 కోట్లు రైతు భరోసా సాయం అందించనున్నారు. కరోనా కష్టాలు ఎన్ని ఉన్నా చెప్పిన మాట మేరకు ఇస్తానన్న సమయానికే వైఎస్‌ఆర్ రైతు భరోసా సాయం అందిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రైతు భరోసా కింద అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి అందిస్తున్న రైతు భరోసా సాయం రూ. 13,500. ఇది మూడు విడతలుగా ఇవ్వనున్న ప్రభుత్వం.
ఆధార్ కార్డు నెంబర్ ద్వారా మీ యొక్క రైతు భరోసా స్టేటస్ ఈ క్రింది లింకు ద్వారా తెలుసుకోండి
PM Kissan Samman Nidhi Status Check
0 comments:
Post a Comment