అది ఫేక్ వెబ్సైట్... ఆన్లైన్ లో ఆనందయ్య మందు పై ఏపీ ప్రభుత్వం క్లారిటీ....

 ఆనందయ్య ఆయుర్వేద మందుపై మళ్లీ వివాదం రాజుకుంది. ఇటీవల ఆయన మందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం నోటిద్వారా తీసుకునే మందు పంపిణీకి మాత్రమే అనుమతి ఉంది. కంటిలో వేసే మందుకు ఇంకా అనుమతి రాలేదు. దీనికి మరింత సమయం పట్టే అవకాశముంది. ఐతే నోటి ద్వారా వేసే మందును సోమవారం నుంచి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఐతే ఎక్కువ మంది కృష్ణపట్నం వచ్చే అవకాశం ఉండడంతో.. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తారని ప్రచారం జరిగింది. Childeal.comలో బుక్ చేస్తే ఇంటికే మందును పంపిస్తారని సోషల్ మీడియాలో సందేశాలు వైరల్ అవుతున్నాయి. ఐతే దీనిపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.

Childeal.com ద్వారా ఆనందయ్య ఆయుర్వేదం మందును పంపిణీ చేస్తారన్న ప్రచారంలో నిజం లేదని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పష్టం చేసింది



అలాంటి అధికారిక వెబ్‌సైట్ ఏదీ లేదని తేల్చిచెప్పింది. ఇప్పటి వరకు ఏ వెబ్‌సైట్‌కు అనుమతి ఇవ్వలేదని వెల్లడించింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలకు సూచించింది. ఒకవేళ అలాంటి నిర్ణయం ఏదైనా తీసుకుంటే ప్రభుత్వమే అధికారికంగా వెల్లడిస్తుందని తెలిపింది.ఈ వెబ్‌సైట్‌కు సంబంధించి టీడీపీ నేత సోమిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఆనందయ్య మందుతో వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. ఆనందయ్య ఉచితంగా ఇస్తున్న మందును రూ.167కు అమ్ముకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. శ్రేషిత టెక్నాలజీ ద్వారా వెబ్‌సైట్‌ను రూపొందించారని.. ఈ కంపెనీలో వైసీపీ నేతలే డైరెక్టర్లుగా ఉన్నారని విరుచుకుపడ్డారు. వెబ్‌సైట్‌లో మందు వివరాలు, ధరను పేర్కొన్నారని.. కానీ మళ్లీ డిలీట్ చేశారని దుయ్యబట్టారు. ఆనందయ్య మందు పేరిట ఫేక్ వెబ్‌సైట్ సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top