HDFC Bank Parivartan’s ECS Scholarship 2021-22 హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ నిరుపేద విద్యార్థులకు ఆర్థిక సహకారం అందించే ఉద్దేశంతో పరివర్తన్స్ ఎడ్యుకేషనల్ క్రైసిస్ స్కాలర్ షిప్ ప్రోగ్రామ్ నిర్వహిస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఆరో తరగతి నుంచి పీజీ వరకు చదువుకుంటున్న విద్యార్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. గత ఏడాది చదివిన తరగతి/ కోర్సులో కనీసం 55 శాతం మార్కులు తప్పనిసరి. కుటుంబ వార్షికాదాయం రూ.2.5 లక్షలు మించని వారికి మెరిట్ కం మీన్స్ ప్రాతిపదికన, గత మూడేళ్లుగా ఆర్ధిక సమస్యలు ఎదుర్కొంటున్న వారికి నీడ్ బేస్డ్ కింద ఆర్థిక సహకారాన్ని అందిస్తారు. కుటుంబానికి ఆదాయాన్ని సమకూర్చే ఇంటి పెద్ద అనుకోని పరిస్థితుల్లో మరణించడం/ ఉద్యోగాన్ని కోల్పోవడం/ వ్యాపారంలో నష్టం/ దీర్ఘకాలిక వ్యాధికి గురవడం! కొవిడ్ 19/ ప్రకృతి విపత్తుల కారణంగా ఆర్థికంగా నష్టపోయినవారి పిల్లలకు నీడ్ బేస్డ్ కేటగిరీ కింద ఆర్థిక సహాయం చేస్తారు. అనాథలు,దివ్యాంగులు, సింగిల్ పేరెంట్ పిల్లలు, థర్డ్జెండర్లకు కూడా ఈ కేటగిరీలోనే సహకారమందిస్తారు.
ప్రొఫెషనల్ ప్రోగ్రామ్: దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో బీబీఏ, బీసీఏ, బీఈ, బీటెక్,ఎంబీఏ, ఎంసీఏ, ఎంఈ, ఎంటెక్ వంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశం పొందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు ఏడాదికి రూ. 75,000ల నగదు ఇస్తారు.
ఎంపిక: వచ్చిన దరఖాస్తులు పరిశీలించి ఆభ్యర్థుల అకడమిక్ ప్రతిభ, వారిఆదాయం, ఎదుర్కొంటున్న ఆర్ధిక సమస్యల ఆధారంగా షార్ట్ లిస్ట్ రూపొందిస్తారు. వీరికి టెలిఫోనిక్ ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తారు.
స్కూల్ ప్రోగ్రామ్: ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఆరో తరగతి పన్నెండో తరగతి వరకు చదువుతున్న పిల్లలందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.ఎంపికైనవారికి ఏడాదికి రూ.35,000ల నగదు చెల్లిస్తారు.
కాలేజ్ ప్రోగ్రామ్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ కాలేజీ నుంచి బీఏ, బీకాం,ఎమ్మే, ఎంకాం తదితర కోర్సుల్లో ప్రవేశం పొందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పదో తరగతి/ పన్నెండో తరగతి/ఇంటర్ తరవాత పాలిటెక్నిక్ కోర్సులు లేదా డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం పొందినవారు కూడా అప్లయ్ చేసుకోవచ్చు. ఎంపికైనవారికి ఏడాదికి రూ.45,000 ఇస్తారు.
ముఖ్య సమాచారం:
* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 31
దరఖాస్తు జత చేయాల్సిన పత్రాలు: గతఏడాది చదివిన తరగతి / కోర్సుకు సంబంధించిన మార్కుల పత్రాలు, అధార్/ ఓటర్ఐడీ/ డ్రైవింగ్ లైసెన్స్, ప్రస్తుతం తీసుకొన్న అడ్మిషన్ ధృవపత్రాలు (ఫీ రిసీట్! ఆడ్మిషన్ లెటర్/ ఇన్స్టిట్యూషన్ ఐడీ కార్డు/బోనఫైడ్ సర్టిఫికెట్), అభ్యర్థి బ్యాంకు పాస్బుక్,ఆదాయ ధృవీకరణపత్రాలు, ఆర్థిక సమస్యల ధృవీకరణపత్రాలు, అఫిడవిట్, అభ్యర్థి ఫొటో
విద్యా సంబంధించిన సమాచారం కోసం ఆంధ్ర టీచర్స్ వాట్సాప్ గ్రూప్ లో చేరండి
https://chat.whatsapp.com/Jt2mq7JwpmG86badUP9XxW
దరఖాస్తు సమర్పించాల్సిన వెబ్ సైట్:
https://www.buddy4study.com/page/hdfc-bank-parivartans-ecs-scholarship
0 comments:
Post a Comment