ఈరోజు ఉపాధ్యాయ సంఘాలతో SCERT డైరెక్టర్ జెడి B.ప్రతాపరెడ్డి గారు సమావేశం ఏర్పాటు.. చర్చించిన ప్రధాన అంశాలు

ఈరోజు ఉపాధ్యాయ సంఘాలతో SCERT డైరెక్టర్ జెడి B.ప్రతాపరెడ్డి గారు సమావేశం ఏర్పాటు..


చర్చించిన  ప్రధాన అంశాలు

★ జూలై నెలలో పాఠశాలల పునః ప్రారంభం ఉండదని కానీ విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా మరియు దూరదర్శన్ ద్వారా విద్యాబోధన చేయాలని, దానికి కార్యాచరణ చేపట్టాలని తెలిపారు. నిర్వహణ, మూల్యాంకనం గురించి సూచనలను అడిగారు.


★ ఒకటవ తరగతి నుండి 8వ తరగతి వరకు ఆన్లైన్ నందు విద్యాబోధన అవసరం లేదని, 9 మరియు పదవ తరగతి లకు ఆన్లైన్ ద్వారా విద్యాబోధన చేపడుతూ, ఆ అంశాలపై గల* *అసైన్మెంట్ ల పర్యవేక్షణ కొరకు వారానికి ఒకరోజు 10 am - 1pm వరకు నిర్వహించేలా, విద్యార్థులను పాఠశాలకు వచ్చే అవసరం లేకుండా ఈ కార్యక్రమం మొత్తం వాలంటీర్ల ద్వారా జరిపే విధంగా చేయాలని తెలియజేయడమైనది.


★ అడ్మిషన్ల గురించి వివరణ అడగగా పాఠశాలలు ప్రారంభించిన తర్వాతే అడ్మిషన్ల అంశం వచ్చునని తెలియజేశారు.


★ సర్వీస్ రూల్స్ విషయం గత రెండు దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్నందున ప్రభుత్వం వైపు నుండి కొన్ని ప్రతిపాదనలు తెలియజేయడం జరిగినది ఏ మేనేజ్మెంట్ వారికి ఆ మేనేజ్మెంట్ ల వారీగా,  వీటిలో ప్రత్యేకించి 13 డీఈఓ పోస్టులు, 49 డిప్యూటీ ఈవో పోస్టులు మరియు 666 ఎం ఈ ఓ పోస్టులను నూతనంగా సర్వీస్ రూల్స్ తో సంబంధం లేకుండా 100% జిల్లాపరిషత్ వారితోనే నియామకం చేసేలా శాంక్షన్ చేయించుటకు కృషి చేస్తామని తెలిపారు.


★ జె ఎల్స్ మరియు డైట్ లెక్చరర్స్ విషయం గురించి అడగగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ క్రింద ఎన్ని జూనియర్ కళాశాలలు ఏర్పాటు జరుగుచున్న కారణంగా ఆ తరువాత  ప్రభుత్వ ప్రతిపాదనల మేరకు జిల్లా పరిషత్ వారితోనే ఆయా పోస్టులను భర్తీ చేసేలా చర్యలు అని తెలిపారు.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Telugu & English News Papers More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top