Today Meetings: ఈరోజు పాఠశాల విద్యాశాఖ మంత్రి గారితో జరిగిన సమావేశానికి వివిధ సంఘాలు చేసిన ప్రాతినిధ్యాలు

 కామ్రేడ్స్!

ఈ రోజు మంత్రి గారితో జరిగిన సమావేశంలో మన వైఖరి, FAPTO వైఖరి సమర్థవంతంగా వినిపించాము. 1,2 సంఘాలు మినహా అన్ని సంఘాలు 3,4,5 తరగతులను హై స్కూల్స్ లో కలపడాన్ని వ్యతిరేకించాయి. ప్రభుత్వ వైఖరిలో లేనట్లు కనబడుతోంది. ఈ నేపథ్యంలో 1,2 రోజుల్లో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిద్దాము.


2. FAPTO నాయకత్వానికి, మనకు ఇచ్చిన మెమోలపై విద్యా శాఖ మంత్రి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి లను కలిసాము. డైరెక్టర్ ఏకపక్ష ధోరణి, సంఘాల పట్ల ఆయన వైఖరి గురించి వివరంగా తెలియజేసాము. సీరియస్ గా ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.


కె యస్ యస్ ప్రసాద్

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

*💐ఈరోజు సచివాలయంలో ఉపాధ్యాయ సంఘాలతో విద్యా శాఖ మంత్రి  సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సమావేశం లో పాఠశాల విద్యా శాఖామాత్యులు ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, విద్యా శాఖ అధికారులు పాల్గొన్నారు.*


 సమావేశంలో ప్రధానంగా నూతన విద్యా విధానం మీద ప్రభుత్వం తలపెట్టిన మార్పుల పైన చర్చ జరిగింది.

 ఈ చర్చలో 49 ఉపాధ్యాయ సంఘాలు పాల్గొన్నాయి.


అన్ని సంఘాలు పూర్వ ప్రాథమిక విద్యను ప్రాథమిక పాఠశాల తో అనుసంధానం చేయటాన్ని స్వాగతించాయి.


అన్ని సంఘాలు ఉన్నత పాఠశాలలో +2ను తీసుకురావడాన్ని అంగీకరించాయి.


44 సంఘాలు 3, 4, 5 తరగతులు ప్రాథమిక పాఠశాల లోనే ఉండాలని చెప్పగా, రెండు సంఘాలు మాత్రం ఉన్నత పాఠశాలలో కలపడాన్ని సమర్థించాయి.

 మిగిలిన సంఘాలు ఈ అంశంపై ప్రస్తావన చేయలేదు.


మాధ్యమం విషయమై దాదాపు 20 సంఘాలు  ప్రాథమిక విద్య మాతృభాషా మాధ్యమంలోనే కొనసాగాలని ఉన్నత పాఠశాలలలో సమాంతరంగా రెండు మాధ్యమాలు కొనసాగాలని చెప్పాయి. మిగిలిన సంఘాలు మాధ్యమం ప్రస్తావన చేయలేదు.


400 లేదా 500 విద్యార్థుల సంఖ్య ఉన్న ఉన్నత పాఠశాలలో  ప్లస్ టు ఏర్పాటు చేయాలని అత్యధిక సంఘాలు కోరాయి.


ప్రాథమిక పాఠశాలలలో ప్రధానోపాధ్యాయుల పోస్ట్ లు మంజూరు చేయాలని, 9 , 10 ,11 ,12 తరగతులలో పిజిటి పోస్టులు మంజూరు చేసి పదోన్నతులు కల్పించాలని, డీఎస్సీ ప్రకటించి, ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని సంఘాలు డిమాండ్ చేశాయి.


ఫ్యాప్టో భాగస్వామ్య సంఘాలన్నీ ఈ అంశాలపై ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి.


ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి గారు మాట్లాడుతూ పూర్వ ప్రాథమిక పాఠశాల ఏర్పాటుకు అందరూ అంగీకరించారని ,

అయితే 3, 4, 5 తరగతులను వేరు చేయటాన్ని వ్యతిరేకిస్తున్నారని,

 దీనిపై ఆలోచన చేద్దామని అన్నారు .

ఇది ప్రారంభ సమావేశం అని ,తర్వాత తల్లిదండ్రులు, పాఠశాల కమిటీలు ,విద్యావేత్తలు, మేధావులు మరియు ఎమ్మెల్సీలు మొదలైన వారితో చర్చలు జరిపి  సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు ప్రస్తుతం  విద్యాశాఖ దీనికి సంబంధించిన సమాచారాన్ని, గణాంకాలు మాత్రమే సేకరిస్తున్న సేకరిస్తున్నదని అన్నారు.

ఈ సమావేశపు అభిప్రాయాలను ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తానని చెప్పారు.


ఈ సమావేశంలో  ఏపిటిఎఫ్ పక్షాన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. పాండురంగ వరప్రసాద రావు  పాల్గొన్నారు.

నేడు విద్యాశాఖ మంత్రి గారితో జరిగిన సమావేశంలో, నూతన విద్యావిధానం లోని లోపాలను సవరించాలని గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి ప్రాతినిధ్యం చేసిన - PRTUAP

SGTF Representation:


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో NEP 2020 పై జరుగుతున్న సమావేశంలో SGTF  ప్రతిపాదనలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గరికపాటి సురేష్ నూతన విద్యావిధానంను స్వాగతిస్తూనే ,కొన్ని సూచనలను ప్రతిపాదించడమైనది. అందులో ముఖ్యంగా
ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడుఉండాలి ,ప్రతి  ప్రీ ప్రైమరీ  పాఠశాలకు FSHM PSHM వలె సృష్టించి,పదోన్నతి ద్వారా భర్తీ చేయాలి. .ప్రైమరీ స్థాయిలో PSHM  ఉండాలి.అర్హులైన SGT లకు కూడా JL , PG టీచర్లు ,ప్రిన్సిపాల్ పదోన్నతులుఉండాలి.
12 సంవత్సరాల నిండిన SGT ను మిడిల్ స్కూల్ లో SAగా పదోన్నతి ద్వారా నియమించాలి.
1:20   నిష్పత్తి లోపల ఉపాధ్యాయులు ఉండాలి.
3,4,5 తరగతులు  ప్రాథమిక పాఠశాల లోనే నిర్వహించాలి.NEP 2020 ను పైలట్ ప్రాజెక్టు ద్వారా అమలు చేసి ,సఫలం అయినప్పుడు మాత్రమే రాష్ట్ర స్థాయిలో అమలు చెయ్యాలి.ఈ సమావేశంలోSGTFరాష్ట్ర కార్వనిర్వాహక కార్యదర్శి గన్నవరపు స్వరూప్ దత్ ఫాల్గోన్నారు.

AP PETs & SA Association:

మిత్రులారా జాతీయ విద్యా విధానం 2020 పైన ప్రభుత్వ  స్థాయిలో జరిగిన సమావేశం నకు ప్రభుత్వ సలహాదారు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరియు విద్యా శాఖ మాత్యులు శ్రీ ఆదిమూలపు సురేష్ గారు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ బి రాజశేఖర్IAS గారు డైరెక్టర్ వీరభద్రుడు IASగారు samagra డైరెక్టర్ శ్రీమతి vetriselvi IAS గారు ఇతర అ ఉన్నతాధికారులు పాల్గొన్నారు

 ఈ సమావేశంలో పాల్గొన్న దాదాపు నలభై ఐదు సంఘాలు మన అభిప్రాయాన్ని సమర్థించాయి. మనం ప్రీ ప్రైమరీ పాఠశాల ను ప్రైమరీ కి అనుసందించాలని, 3, 4, 5 తరగతుల తరలింపును ఆపాలని, ప్రతి ప్రాథమిక పాఠశాల కి PSHM పోస్టులు మంజూరు చేయాలని ,8వ తరగతి వరకు అన్ని యాజమాన్యాల లో మాతృభాషలో బోధన జరగాలని, ఉన్నత పాఠశాలలో సమాంతర మాధ్యమం కొనసాగాలని, ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి.         1 :20  ఉండాలని ,ప్రస్తుతం ఖాళీగా ఉన్న 26 వేల పోస్టులు భర్తీ చేయాలని, సేవా సంస్థల ముసుగులో ప్రైవేటు వ్యక్తుల వ్యాపారాన్ని నిరోధించాలని ప్రతి మండలంలో ఎక్కువ నమోదు కలిగిన రెండు ఉన్నత పాఠశాలలో ప్లస్ టు ప్రారంభించాలని, అందులో జూనియర్ లెక్చరర్ లు గా అర్హులైన ఉపద్యాయులను ప్రమోషన్ ద్వారా నియమించాలని, విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని కోరడం జరిగింది ప్రభుత్వ సలహాదారు మన సూచనలను తన డైరీ నందు నమోదు చేసుకొని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్తానని చెప్పడం జరిగింది అలాగే డైరెక్టర్ గారు మాట్లాడుతూ సర్కులర్ 172 ద్వారా సమాచారాన్ని సేకరించేందుకు ఇచ్చామని అది ఉత్తర్వు కాదని ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఏదైనా నిర్ణయం జరిగినప్పుడు మాత్రమే మీ అధిష్టానానికి వ్యతిరేకంగా ఉన్నచో పత్రికలకు ప్రకటనలు ఇవ్వాలని అలా కాక ఎడాపెడా ప్రకటనలు ఇస్తే డిపార్ట్మెంట్ కొంత ఇబ్బంది పడుతుందని అందులో మీరు మేము భాగస్వాములని ఇకపైన మీకు మాకు మధ్య నమ్మకం తో  ముందుకు సాగాలని కోరారు ప్రభుత్వ సలహాదారు ఫ్యాప్టో నాయకత్వానికి ఇచ్చిన మెమోలు ఉపసంహరించుకునేలా చేస్తామని హామీ ఇచ్చారు                  

హృదయ రాజు అధ్యక్షులు కె.వెంకటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్


APUS AP: తేదీ 17.6.2021 న గౌరవ విద్యాశాఖా మాత్యులు ఆదిములపు సురేష్ గారి అధ్యక్షత న NEP2020 పై ఉపాధ్యాయ సంఘాల సమావేశం జరిగినది. మనసంఘం తరఫున ఈ క్రింది అంశాలను ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్లడం జరిగింది.  1. NEP2020 అమలును స్వాగతిస్తున్నాం. 2.5+3+3+4 ప్యాట్రన్ యధావిధిగా అమలు పరచాలి. 3. మాతృభాషలో ప్రాధమికస్థాయి లో విద్యాబోధన జరగాలి. సమంతర మీడియం లు 6 to10 తరగతులు నిర్వహించాలి. 4. అంగన్వాడీలను విలీనం వల్ల 1,2 తరగతులకు ఇద్దరు ఉపాధ్యాయులు ఇవ్వాలి. 5.PS. HM పోస్టులు యధావిధిగా కొనసాగిస్తూ అదనంగా ప్రతిప్రాధమిక పాఠశాలకు 1 పోస్ట్ మంజూరు చేయాలి. 6. 1 కి.మీ.లోపు3,4,5 తరగతులనుమాత్రమే ఉన్నత పాఠశాలలోకలపాలి. 7. 9,10 తరగతులు వేరుచేసి 11,12 తరగతులతో హయ్యర్ సెకండరీ విద్య ఏర్పాటు చేయాలి. లెక్చరర్ పదోన్నతులు కల్పించాలి. 8. 1 కి.మీ. పైన ఉన్న 3,4,5 పాఠశాలలను యధావిధిగా కొనసాగించి దశలవారీగా 6,7,8 తరగతులు ఏర్పాటు చేయాలి. 9. ప్రాధమిక పాఠశాలకు PS HM, మిడిల్ స్కూల్ కు Gr II HM, హయ్యర్ స్కూలుకు Gr I HM పోస్టులు ఇవ్వాలి.10. మిడిల్ స్కూలు లో స్కూల్ అసిస్టెంట్స్ మాత్రమే విద్యాబోధన చేయాలి. 🙏సిహెచ్ శ్రావణ్ కుమార్ 

రాష్ట్ర అధ్యక్షుడు, APUS AP

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Capacity Building Training & Registration Links
Telugu & English News Papers
Ammavodi Eligibility Lists
FA & SA Marks Entry
Read Along App and May 2021 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top