నిన్న జరిగిన విద్యాశాఖ సమీక్షలో కీలక నిర్ణయాలు ఇవే..

★ ఆగష్టు 16 నుంచి పాఠశాలలు పునః ప్రారంభం

★ మొదటి విడత నాడు–నేడు కింద రూపుదిద్దుకున్న స్కూళ్లను ప్రజలకు అంకితం చేయనున్న ముఖ్యమంత్రి

★ రెండోవిడత నాడు –నేడుకు అదే రోజు శ్రీకారం

★ అదే రోజు విద్యాకానుక ప్రారంభం

★ నూతన విద్యా విధానం విధి, విధానాలపై ఆగష్టు 16నే ప్రకటన 

★ నూతన విద్యావిధానంపై గత సమావేశాల్లో ఆలోచనలు, వాటిని ఖరారు చేయడంపై చేసిన కసరత్తును సీఎంకు వివరించిన అధికారులు

★ నూతన విద్యావిధానాన్ని అనుసరించి స్కూళ్ల వర్గీకరణ ఖరారు

★ ఏమైనా మెరుగులు దిద్దాల్సి ఉంటే.. ఈ ప్రక్రియ పూర్తిచేసి ఆగస్టు 16న నూతన విద్యా విధానం విధివిధానాలను వెల్లడించాలన్న సీఎం

★ కొత్త విద్యావిధానంలో పీపీ–1 నుంచి 12వ తరగతి వరకూ ఆరు రకాల స్కూల్స్‌

★ శాటిలైట్‌ పౌండేషన్‌ స్కూల్స్‌  ( పీపీ–1, పీపీ–2)

★ పౌండేషన్‌ స్కూల్స్‌  (పీపీ–1, పీపీ–2, 1, 2 తరగతులు)

★ పౌండేషన్‌ ప్లస్‌ స్కూల్స్‌ (పీపీ–1, పీపీ–2, 1, 2, 3, 4, 5 తరగతులు)

★ ప్రీహైస్కూల్స్‌ (పీపీ–1, పీపీ–2, 1, 2, 3, 4, 5, 6, 7 తరగతులు)

★ హైస్కూల్స్‌  (3 నుంచి 10వ తరగతి వరకూ)

★ హైస్కూల్‌ ప్లస్‌ ( 3 నుంచి 12వ తరగతి వరకూ) రానున్నాయని తెలిపిన సీఎం. 

★ పౌండేషన్‌ స్కూళ్లలో భాగంగా అంగన్‌ వాడీల నుంచే ఇంగ్లిషు మీడియం ప్రారంభం అవుతుంది

★ శాటిలైట్‌ పౌండేషన్‌ స్కూల్స్‌గా అంగన్‌వాడీలు రూపాంతరం చెందుతాయి

★ శాటిలైట్‌ ఫౌండేషన్‌ స్కూల్స్‌కు ఫౌండేషన్‌స్కూల్స్‌ మార్గనిర్దేశకత్వం వహిస్తాయి

★ ఇక్కడ కూడా ఎస్‌జీటీ టీచర్లు పర్యవేక్షణచేస్తారు, ఉత్తమ బోధన అందేలా చూస్తారు

★ శాటిలైట్‌ పౌండేషన్‌ స్కూల్‌ ప్రతి ఆవాసంలో ఉంటుంది. 

★ కిలోమీటరు లోపలే పౌండేషన్‌ స్కూల్‌ ఏర్పాటవుతుంది

★ మూడు కిలోమీటర్ల పరిధిలో హైస్కూల్‌ ఉంటుంది

★ మూడు కిలోమీటర్ల పరిధి దాటి ఒక్క స్కూలూ ఉండదు

★ వీటన్నింటినీ పక్కాగా ఏర్పాటు చేస్తూ నూతన విద్యా విధానాన్ని అమలు చేయబోతున్నాం

★ ఉపాధ్యాయులను అత్యంత సమర్ధవంతంగా ఉపయోగించుకోవడమే నూతన విధానం ప్రధాన లక్ష్యం 

★ పిల్లలకు ప్రతి సబ్జెక్టుపై నైపుణ్యం, ఆ సబ్జెక్టులో చక్కటి పరిజ్ఞానం ఉన్న టీచర్లతో బోధన ఉంటుంది

★ ప్రస్తుతం 5 తరగతి వరకు ప్రతి టీచర్‌ 18 రకాల సబ్జెక్టులు బోధిస్తున్నారు 

★ ఇంటర్‌ తర్వాత డిప్లమో ఇన్‌ ఎడ్యుకేషన్‌ చేసి సెకండరీ గ్రేడ్‌ టీచర్లుగా పనిచేస్తున్నారు

★ కొన్ని చోట్ల సుమారు 200 మంది విద్యార్థులకు ఒకే ఉపాధ్యాయుడు, మరికొన్ని చోట్ల నలుగురికి ఒకే టీచర్‌ బోధిస్తున్న పరిస్ధితి ఉంది

★ నూతన విద్యా విధానంలో ఈ రకమైన పరిస్ధితుల్లో మార్పు తెస్తున్నాం

★ 5వ తరగతి వరకు 18 సబ్జెక్టులును బీఈడీ, పీజీ చేసిన ఉపాధ్యాయులతో సబ్జెక్టుల వారీగా పిల్లలకు బోధన అందించబోతున్నాం 

★ తద్వారా పిల్లలకు ఫోకస్డ్‌ ట్రైనింగ్‌ వస్తుంది 

★ విద్యార్ధులు, ఉపాధ్యాయుల నిష్పత్తి శాస్త్రీయంగా ఉండేలా రూపొందిస్తున్నాం

★ ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్‌ రాబోతున్నారు

★ ఎందుకు ఈ విధానానికి పోతున్నామనే దానిపై మరింత జాగ్రత్తగా అందరికీ అర్థమయ్యేలా చెప్పాలని అధికారులకు సీఎం జగన్‌ నిర్దేశం

★ పౌండేషన్‌ స్కూల్స్, నూతన విద్యా విధానంపై ఉపాధ్యాయ సంఘాలతో సమావేశాలు జరిగాయా ? లేదా ? అని అధికారులను ప్రశ్నించిన సీఎం

★ ఇప్పటికే వివిధ సంఘాల ప్రతినిధులతో విస్తృతంగా చర్చించామన్న అధికారులు

★ ఇందులో ఎటువంటి సందేహాలకు తావుండరాదు

★ తల్లిదండ్రులకు కూడా ఈ విషయం స్పష్టంగా అర్థం కావాలి

★ నూతన విద్యా విధానం వల్ల కలిగే ప్రయోజనాలు కూడా వారికి తెలియాలి

★ ఆ మేరకు విస్తృతంగా అవగాహన కలిగించాలి : సీఎం ఆదేశం

★ నాడు – నేడు, నూతన విద్యావిధానంకోసం మనం సుమారు రూ.16వేల కోట్లు ఖర్చుచేస్తున్నాం

★ దీని ద్వారా సాధించబోయే లక్ష్యాలను స్పష్టంగా చెప్పాలి

★ ఈ రకమైన మార్పులు తీసుకురావడం ద్వారా విద్యావ్యవస్ధ పునరుజ్జీవనానికి ఏం చేయబోతున్నామో చెప్పాలి

★ మరోవైపు ఉపాధ్యాయులకు కూడా దీనిపై సమగ్ర అవగాహన కలిగించాలి

★ నూతన విద్యా విధానంలో ఏరకంగా ఉద్యోగ తృప్తి ఉంటుందో వివరించాలి

★ అంగన్‌వాడీలకు మరింత ప్రోత్సాహం కలిగించేందుకు వారికి ప్రమోషన్‌ ఛానల్‌ ఏర్పాటు చేస్తున్నాం

★ ప్రతి తరగతికి ఒక టీచర్‌ ఉండేలా హేతుబద్దీకరణ

★ జాతీయ ప్రమాణాలను అనుసరించి విద్యావ్యవస్ధ 

★ ఏ స్కూలునూ మూసేయం, ఎవ్వరినీ తొలగించం

★ మొదటి విడత నాడు–నేడులో అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మరింత సమర్ధవంతంగా ముందుకు సాగాలి 

★ అధికారులతో సీఎం వైఎస్‌ జగన్‌ స్పష్టీకరణ

★ పిల్లల భవిష్యత్తుకోసం, సమాజ శ్రేయస్సు కోసం ఇంత ఖర్చు పెడుతున్నాం

★ ఎక్కడా అవినీతికి, వివక్షతకు తావుండరాదు

★ ఇలాంటి ఆలోచన గతంలో ఏ ప్రభుత్వమూ చేయలేదు

★ పిల్లల చదువుల కోసం ఇంత ఖర్చు చేసిన ప్రభుత్వమూ గతంలో లేదు

★ పారదర్శకతతో పనులు ముందుకు సాగాలి

★ అవినీతి ఏ స్ధాయిలో ఉన్నా సహించేది లేదు

★ అధికారులకు స్పష్టం చేసిన సీఎం

★ నూతన విద్యా విధానం, నాడు నేడు తొలిదశ పనులు పై సీఎంకు వివరాలందించిన అధికారులు

★ తొలిదశలో నాడు–నేడు చేపట్టిన స్కూల్స్‌లో  పనులు దాదాపు పూర్తయ్యాయన్న అధికారులు

★ అమ్మఒడి, నాడు–నేడు, విద్యాకానుక, జగనన్న గోరుముద్ద, ఇంగ్లిషు మీడియం వంటి సంస్కరణలు విద్యా వ్యవస్ధలో మంచి ఫలితాలు అందించబోతున్నాయన్న అధికారులు

★ స్కూల్స్‌ ప్రారంభం కాబోతున్న నేపధ్యంలో పాఠ్యపుస్తకాలు, డిక్షనరీ, జగనన్న విద్యా కానుక పంపిణీపై సమగ్ర వివరాలు అందించిన అధికారులు

★ ఆగష్టు 16 నాటికి అంతా సన్నద్దంగా ఉండాలని అధికారులను ఆదేశించిన సీఎం

★ వరుసగా రెండేళ్లు పరీక్షలు నిర్వహించకుండానే టెన్త్‌ విద్యార్థులను పాస్‌చేశామన్న అధికారులు

★ కొన్ని రిక్రూట్‌మెంట్లలో మార్కులను పరిగణలోకి తీసుకుంటున్నారని, దీనివల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్న అంశాన్ని ప్రస్తావించిన అధికారులు

★ దీన్ని పరిగణలోకి తీసుకుని 2020 టెన్త్‌ విద్యార్థులకూ కూడా మార్కులు ఇవ్వాలని నిర్ణయం

★ అంతర్గత పరీక్షల ఆధారంగా మార్కులు ఇవ్వనున్నట్టు తెలిపిన అధికారులు

★ అలాగే 2021 టెన్త్‌ విద్యార్థులకూ మార్కులు ఇవ్వనున్నట్టు తెలిపిన అధికారులు

★ స్లిప్‌టెస్టుల్లో మార్కులు ఆధారంగా 70శాతం మార్కులు, ఫార్మెటివ్‌ అసెస్‌మెంట్‌ ఆధారంగా మిగిలిన 30శాతం మార్కులు ఇస్తామన్న అధికారులు

★ మొత్తం మార్కులు ఆధారంగా గ్రేడ్లు ఇస్తామని వెల్లడి

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top