కొత్త పాఠశాలలు - చిన్న విశ్లేషణ (అంచనా మాత్రమే)

 కొత్త పాఠశాలలు - చిన్న విశ్లేషణ

(అంచనా మాత్రమే)


1. శాటిలైట్ ఫౌండేషన్: ఇవి అంగన్ వాడి కేంద్రాలు లేని ప్రతి గ్రామంలో ఉంటాయి. 

కనీసం 20మంది పిల్లలు కూడా లేని చోట్ల ఇవి ఉంటాయి.

ఇక్కడ కేవలం అంగన్ వాడి కార్యకర్త మాత్రమే వుంటారు.

సమీపంలో వుండే SGT లే వీటిని పర్యవేక్షణ బాధ్యత ఉంటుంది.


2. ఫౌండేషన్ పాఠశాల : ప్రస్తుతం అంగన్ వాడి కేంద్రాలు ఉన్న చోట ఉంటాయి. ఆ గ్రామంలోని లేదా సమీపంలోని ప్రాథమిక పాఠశాలలోని 1,2 తరగతులను ఇందులో కలుపుతారు. విద్యార్థుల సంఖ్యను బట్టి SGT లను నియమిస్తారు.


3. ఫౌండేషన్ ప్లస్: ప్రస్తుతం ప్రాథమిక పాఠశాల, అంగన్ వాడి కేంద్రాలు ఉన్నచోట యధావిధిగా ఉంటాయి. 

SGTలు అంగన్ వాడి కేంద్రాలకు కూడా పర్యవేక్షణ బాధ్యత ఉంటుంది.


4. ప్రి హైస్కూలు : ప్రస్తుతం ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలు యధావిధిగా వుంటాయి. ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయులు అలాగే వుంటారు.

అంగన్ వాడి కేంద్రం ఈ పాఠశాల పరిధిలోకి వస్తుంది.


5. హైస్కూలు : ప్రస్తుతం ఉన్న హైస్కూలు యధావిధిగా ఉంటుంది. అదే గ్రామంలో వుండే ప్రాథమిక పాఠశాలలోని 3 నుండి 5 తరగతుల పిల్లలు ఈ హైస్కూలు పరిధిలోకి వస్తుంది. వసతి సౌకర్యాలను బట్టి అదే చోట కొనసాగవచ్చు. SGTలు హైస్కూలు HM అజమాయిషీలో పనిచేస్తారు.


6. హైస్కూలు ప్లస్: ప్రస్తుతం ఉన్న హైస్కూలు, ప్రాథమిక పాఠశాలలతో పాటు ఇంటర్మీడియట్ కూడా ఇందులోకి వస్తుంది. వసతులను బట్టి యధావిధిగా ఉంటాయి. అవసరమైన చోట మార్పులు వుంటాయి. వీటి బాధ్యత Principal కు ఉంటుంది.


👆ఆవసరాలను బట్టి SGT లను, SAలను సర్దుబాటు చేస్తారు.


3వ తరగతి నుండి బోధించే SGTలకు SUBJECT లను కేటాయిస్తారు.


సీనియారిటీ ప్రాతిపదికన సర్దుబాటు చేస్తారు.


ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం కేవలం ఊహాజనిత అంచనా 

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top