బేస్ లైన్ పరీక్ష, వారధి వర్క్ షీట్స్ మరియు FA-1 & FA-2 (6 నుండి 9 తరగతులు) మార్కుల నమోదుపై ప్రధానోపాధ్యాయులకు ముఖ్య సూచనలు ....

బేస్ లైన్ పరీక్ష, వారధి వర్క్ షీట్స్  మరియు FA-1 & FA-2 (6 నుండి 9 తరగతులు) మార్కుల నమోదుపై ప్రధానోపాధ్యాయులకు ముఖ్య సూచనలు ....

1.జిల్లా లోని ప్రభుత్వ యాజమాన్యంలోని అన్ని పాఠశాలలలో బేస్ లైన్ పరీక్ష చక్కగా నిర్వహిస్తున్నందులకు ముందుగా ఉప విద్యాశాఖాధికారులకు, మండల విద్యాశాఖాధికారులకు, ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు అభినందనలు. 

2.  బేస్ లైన్ పరీక్ష జవాబు పత్రాలను విద్యార్ధుల తల్లిదండ్రుల ద్వారా తెప్పించుకొని వాటిని వెంటనే మూల్యాంకనము చేయాలి.

3.  విద్యార్దులు పొందిన మార్కులను సబ్జెక్టు వారీగా పాఠశాలలో ప్రత్యేక రిజిస్టర్ నందు నమోదు చేయాలి.

4.  సి.ఎస్.ఇ  పోర్టల్ త్వరలో ఓపెన్ అవుతుంది. పోర్టల్ ఓపెన్ అయిన వెంటనే తరగతి వారీగా, సబ్జెక్టు వారీగా ప్రతి విద్యార్ధి మార్కులు . సి.ఎస్.ఇ సైట్ నందు నమోదు చేయాలి.

5. కొద్ది రోజులలో అన్ని మండలాలకు వారధి వర్క్ షీట్ బుక్ లెట్స్ సప్లై చేయబడతాయి. వాటిని వెంటనే ప్రభుత్వ యాజమాన్యంలోని అన్ని పాఠశాలలకు అందించాలి.

6. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తల్లిదండ్రుల ద్వారా విద్యార్దులకు వారధి వర్క్ షీట్ బుక్ లెట్స్  అందజేయవలయును.

7.  ఆన్లైన్లో సప్తగిరి ఛానల్ నందు బోధన ప్రారంభమైన తరువాత విద్యార్థులు ఈ వారధి వర్క్ షీట్స్ పూర్తి చేయునట్లు చూడవలెను.

8.6 నుండి 9 తరగతుల విద్యార్దులకు గత విద్యా సంవత్సరం అనగా 2020-21 విద్యా సంవత్సరంలో నిర్వహించిన FA-1 మరియు FA-2 ల మార్కులను ఇంకా కొన్ని పాఠశాలల వారు సి.ఎస్.ఇ పోర్టల్ నందు పూర్తిగా నమోదు చేయలేదు. అలాంటి పాఠశాలలు వెంటనే వాటిని నమోదు చేయాలని ఆదేశించడం అయినది.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top