Joint Home Loan: బ్యాంకు హోమ్ లోన్ తీసుకున్నప్పుడు టాక్స్ బెనిఫిట్ ఎలా పొందాలి?

 ప్రైమరీ అప్లికెంట్, కో- అప్లికెంట్ ఇద్దరూ హోమ్ లోన్ ఈఎంఐ కడుతున్నప్పుడు ట్యాక్స్ బెనెఫిట్స్ పొందవచ్చు. సంవత్సరానికి రూ. రెండు లక్షల చొప్పున ట్యాక్స్ బెనెఫిట్ పొందే వీలుంటుంది. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 24బి కింద ఈ మినహాయింపును ఇద్దరూ పొందవచ్చు. దీంతో పాటు 80సి కింద మరో 1.5 లక్షల వరకు ట్యాక్స్ బెనెఫిట్స్ పొందవచ్చు. అయితే దీనికి ఇద్దరు వ్యక్తులు ఇంటికి యజమానులుగా ఉండాల్సి ఉంటుంది. చాలా సంస్థలు మహిళలకు ప్రత్యేకంగా తక్కువ వడ్డీ రేటుకే రుణాలను అందిస్తున్నాయి. మామూలు వడ్డీ కంటే మహిళలకు 5 బీపీఎస్ పాయింట్లు తక్కువ వడ్డీకి అందిస్తున్నాయి. వారి పేరును కూడా జాయింట్ హోమ్ లోన్‌లో చేర్చుకోవడం వల్ల తక్కువ వడ్డీకి రుణాలు అందుతాయి.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top