SBI Salary Account:ఎస్‌బీఐలో శాలరీ అకౌంట్ తెరిస్తే.. రూ.30 లక్షల వరకు ఉచిత ఇన్సూరెన్స్ బెనిఫిట్ పొందొచ్చు

 దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI తన కస్టమర్లకు ఎన్నో రకాల సేవలు అందిస్తోంది. వీటిల్లో బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ సర్వీసులు కూడా ఒక భాగమనే చెప్పాలి. బ్యాంక్‌లో ఎన్నో రకాల అకౌంట్లు ఉన్నాయి. సేవింగ్స్ ఖాతా, కరెంట్ అకౌంట్, శాలరీ అకౌంట్, జీరో అకౌంట్ ఇలా పలు రకాల ఖాతాలున్నాయి. ఎస్‌బీఐలో శాలరీ అకౌంట్ తెరిస్తే.. రూ.30 లక్షల వరకు ఉచిత ఇన్సూరెన్స్ బెనిఫిట్ పొందొచ్చు. అలాగే అపరిమిత ఏటీఎం లావాదేవీలు నిర్వహించొచ్చు. ఉచిత నెఫ్ట్, ఆర్‌టీజీఎస్ సర్వీసులు లభిస్తాయి. ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఉంటుంది. ఇలా శాలరీ అకౌంట్ తెరిస్తే చాలా బెనిఫిట్స్ పొందొచ్చు. ఎస్‌బీఐ శాలరీ ఖాతా కలిగిన వారికి యాక్సిడెంటల్ డెత్ కవర్ లభిస్తుంది.రూ.20 లక్షల వరకు ప్రమాద బీమా వర్తిస్తుంది. ఎయిర్ యాక్సిడెంటల్ డెత్ కవర్ కూడా ఉంది. రూ.30 లక్షల వరకు ప్రమాద బీమా వస్తుంది. అలాగే ఏ తరహా లోన్ తీసుకున్నా కూడా 50 శాతం ప్రాసెసింగ్ ఫీజు తగ్గింపు లభిస్తుంది.



అలాగే 2 నెలల ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఉంది. అంటే మీరు 2 నెలల వేతనాన్ని ముందుగానే పొందొచ్చు. అలాగే లాకర్ చార్జీల్లో కూడా తగ్గింపు ఉంటుంది. 25 శాతం వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ఇంకా ఎస్ఎంఎస్ అలర్ట్స్ కూడా ఉచితంగానే పొందొచ్చు

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top