ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్‌తో వినియోగదారులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ యాప్ మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మనం ఎవరికైనా ముఖ్యమైన ఫోటోలను పంపాల్సి వస్తే.. వాటిని అవతలి వారు ఒకసారి మాత్రమే చూసేలా పంపొచ్చు. మనం పంపిన ఫోటోలు, వీడియోలను అవతలి వారు చూసిన తర్వాత.. మళ్లీ వాటిని ఓపెన్ చేయడం కుదరదు. ఇందుకోసం 'వ్యూ వన్స్' ఆప్షన్‌ను తీసుకొచ్చింది.
ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది:
మీరు మీ వాట్సాప్ సెట్టింగ్స్‌లో 'వ్యూ వన్స్'అనే ఆప్షన్ చూడవచ్చు. మీరు ఏదైనా ఫోటోను రిసీవ్ చేసుకున్నప్పుడు.. ప్రివ్యూ కనిపించదు. మీరు ఆ ఫోటోను ఒకసారి చూసిన తర్వాత.. స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ మరియు ఫేస్‌బుక్ మెసెంజర్‌ల వలె మళ్లీ చూడలేరు. ఫోటోను చూసిన తర్వాత.. మళ్లీ ఓపెన్ చేయాలని చూస్తే ఓపెన్డ్ అనే మెసెజ్ కనిపిస్తుంది.
ఈ ఫీచర్‌ను ఎప్పుడు అందుబాటులోకి వస్తుందంటే..:
ఈ ఫీచర్ ఈ వారంలోనే వినియోగదారులందరికీ అందుబాటులోకి రాబోతోందని వాట్సాప్ తెలిపింది. కాబట్టి, మీ ఫోన్‌లో ఈ ఫీచర్ ఇంకా అందుబాటులోకి రాకపోతే.. మీ వాట్సాప్ యాప్‌ను ఒకసారి అప్‌డేట్ చేయండి.
0 comments:
Post a Comment