త్వరలో PRC అమలు - రాష్ట్ర విద్యా శాఖ మంత్రి
త్వరలో పిఆర్సి అమలు చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. పంచాయతీరాజ్ శాఖలో 25 ఏళ్లుగా పరిష్కారం కాని ఎంపిడిఒల ఉద్యోగోన్నతి సమస్యను పరిష్కరించామన్నారు. శనివారం మండల పరిధిలోని మిట్టమీదపల్లిలో ఎపి మోడల్ స్కూల్ ఆవరణంలో ఎంపిడిఒల ఉద్యోగోన్నతులపై విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 వేల మంది పంచాయతీరాజ్ శాఖలో వివిధ హోదాలలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉద్యోగోన్నతి కల్పించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. వీటితో పాటు పది వేల మంది తెలుగు పండిట్లకు కూడా ఉద్యోగోన్నతి కల్పించామన్నారు.


Learn a Word September 2022 Schedule
0 comments:
Post a Comment