ఎయిడెడ్ స్కూల్స్ టీచర్స్ సీనియార్టీ లిస్ట్ ను సవరించాలి- బి టి ఎ
ఆంధ్ర టీచర్స్ (అక్టోబర్ 30) ఎయిడెడ్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ప్రభుత్వ యాజమాన్యంలో కలుపుకోవడానికి వారి యొక్క సీనియార్టీ జాబితాను తయారు చేస్తూ ఉన్నది ఈ తయారుచేసే జాబితాలో క్రింది అంశాలు పరిశీలించాలని పాఠశాల విద్యా సంచాలకులు వారికి బహుజన టీచర్స్ అసోసియేషన్ , ఆంధ్ర ప్రదేశ్ వారు ప్రాతినిధ్యం చేయడం జరిగింది.
ప్రాతినిధ్యాలు:
1) సింగల్ టీచర్స్ తో నడుస్తున్న ఏకోపాధ్యాయ పాఠశాలల ఖాళీలను కూడా, ఎయిడెడ్ టీచర్స్ కౌన్సిలింగు నిర్వహించునప్పుడు ఏ పోస్ట్ ను బ్లాక్ చేయకుండా, అన్నీ ఖాళీలను వెల్లడి చేసి నియామకం చేపట్టాలి,
2) అంతర్జాల్లా బదిలీలలపై వచ్చిన టీచర్స్ యొక్క సీనియాని వారు సర్వీసు లో చేరిన తేదీ నుండి తీసుకుంటున్నారు. సీనిని లెక్కించనప్పుడు ఈ జిల్లాలో మొదట నియామకం పొందిన స్థానిక టీచర్ల తరువాత అంతర్జు బదిలీలలపై వచ్చిన టీచర్స్ పేరుని" చేర్చవలెను. కావునా, టీచర్ల వివరాలను వారి సేవాపుస్తకం లోని వివరాల ఆధారంగా సీనియార్డ్ జాబితా సవరించవలసిందిగా కోరుచున్నాము.
3) ఎయిడెడ్ పాఠశాలలు మూసివేసి, దగ్గరలో ప్రత్యామ్నాయ పాఠశాలలు లేని చోట మండల ప్రజాపరిషత్ పాఠశాలను వెంటనే నెలకొన్ని విద్యార్థుల విద్యాభ్యాసానికి ఆటంకం కలుగకుండా, అక్కడ ప్రభుత్వం ఉపాధ్యాయులను నియమించ వలసిందిగా కోరుచున్నాము.
4) ఎయిడెడ్ ఉపాధ్యాయులకు ప్రాధాన్యత పాయింట్స్ (Urinamired. Spouse, Wicklow.PHC) కేటాయించి కౌన్సిలింగ్ నిర్వహించాలి.
5) అర్హత గల సెకండరీ గ్రేడ్ టీచర్స్ ను, అవసరత ఉన్న హైస్కూల్స్ నందు గల ఖాళీలలో కూడా నియమించేలా నిబంధనలను సవరించాలని కోరుచున్నాము.
6) విలీనం చేసిన ఎయిడెడ్ టీచర్స్ యొక్క అక్టోబర్ - 21 నెలకి సంబంధించి ఇంక్రిమెంట్ మరియు జీతాలను మంజూరు ఆదేశాలు జారీ చేయాలని కోరుచున్నాము.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు Ch శరత్ చంద్ర, ప్రధాన కార్యదర్శి P వెంకట్ రావు పాల్గొన్నారు
0 comments:
Post a Comment