ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారిని కలసిన AP JAC మరియు AP JAC అమరావతి నాయకులు

సి.యస్ గారిని మర్యాదపూర్వకంగా కలసిన AP JAC మరియు AP JAC అమరావతి

తేదీ.07.10.2021

  


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శ్రీ సమీర్ శర్మ IAS గారు  పదవీ భాధ్యతలు చేపట్టిన సందర్బాన... AP JAC మరియు AP JAC అమరావతి చైర్మన్లు బండి శ్రీనివాసరావు మరియు బొప్పరాజు ఆద్వర్యములో రెండు JAC ల రాష్ట్ర నాయకత్వాలు సంయుక్తంగా శ్రీ సమీర్ శర్మ IAS., గారిని మర్యాదపూర్వకంగా కలసి అభినందించడమైనది.

ఈ సందర్భంగా బొప్పరాజు గారు మరియు బండి శ్రీనివాసరావు  గౌరవ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారిని కోరుతూ... 11వ PRC అమలు చేయుట, CPS రద్దు పరచుట, కాట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాల పెంపుదల లాంటి ప్రధాన సమస్యల  సంబంధించి కమిటీల నివేదికలు సిద్దంగావున్న నేపధ్యములో, వీలైనంత త్వరగా వాటిని పరిష్కరించి ఉద్యోగులకు సహాయం చేయాలని  శ్రీ సమీర్ శర్మ IAS.,  గారిని కోరడమైనది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారి ఆధ్వర్యంలో వెంటనే జాయింట్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని ప్రధానంగా రెండు JAC ల నాయకత్వాలు కోరడమైనది.

ఈ కార్యక్రమములో APJAC మరియు APJAC అమరావతి సెక్రెటరీ జనరల్ లు హృదయ రాజు మరియు వై.వి.రావు APNGO అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కె వి శివారెడ్డి, ఫ్యాప్టో చైర్మన్ సి.హెచ్.జోసెఫ్ సుధీర్ బాబు,కో - చైర్మన్లు: KSS ప్రసాద్, సీతారామరాజు, కె.భానుమూర్తి, గోపాల కృష్ణ.     AP JAC అమరావతి ,అసోసియేట్ చైర్మన్ ఫణి పేర్రాజు, కోశాధికారి మురళి కృష్ణ నాయుడు, కో చైర్మన్ మరియు మున్సిపల్ ఉధ్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డొప్పలపూడి ఈశ్వర్,  కో చైర్మన్ మరియు రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాస రావు, రాష్ట్ర labour officers అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బి.కిషోర్ కుమార్, రాజేష్, సిటీ యూనిట్ ప్రెసిడెంట్ కళాదర్, రాష్ట్ర SLTA రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ,JAC కో చైర్మన్ శివానందరెడ్డి, ప్రద్దనోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు JAC కో చైర్మన్ జి. వి  నారాయణ రెడ్డి, ప్రభుత్వ డ్రైవర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు , కో చైర్మన్ డి. యెస్.కొండయ్య, విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి జి. జయబాబు, మహిళా విభాగం నాయకురాలు సత్య మంగలాంబ, నెల్లూరు జిల్లా చైర్మన్ అల్లంపాటి పెంచల రెడ్డి , కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గిరి కుమార్ రెడ్డి, డి.జి.ప్రసాద రావు JAC రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి S. మల్లీశ్వరావు, ANMs రాష్ట్ర అధ్యక్షురాలు సులోచనమ్మ, గుంటూరు జిల్లా చైర్మన్ కె.సంగీత రావు మరియు APRSA రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్.వెంకట రాజేష్  తదితర నాయకులు పాల్గొన్నారు.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top