APTF మహిళా ప్రతినిధి శ్రీమతి పి.శాంతిలక్ష్మి గారు..
ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ శ్రీమతి వాసిరెడ్డి పద్మ గారి అధ్యక్షతన ఈరోజు MGM CAPITAL లో జరిగిన మహిళా ఉద్యోగుల సమావేశం...
ఈ సమావేశానికి హాజరై మహిళా ఉపాధ్యాయుల,బాలికల సమస్యలు- పరిష్కారాలపై ప్రాతినిధ్యం చేసిన APTF మహిళా ప్రతినిధి శ్రీమతి పి.శాంతిలక్ష్మి గారు..
ఈ సందర్భంగా మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లిన అంశాలు:
1.కేంద్రప్రభుత్వం తన పరిధిలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు 2 సంవత్సరాల చైల్డ్ కేర్ లీవ్ ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం కేవలం 2 నెలలు మాత్రమే ఇస్తుందని దీనిని సవరించి కేంద్ర ప్రభుత్వం మహిళా ఉద్యోగుల విషయంలో అమలుచేస్తున్న విధానాన్ని పాటించాలని..,
2. మహిళా ఉద్యోగులు డ్యూటీ సమయంలో ఉన్నపుడు తమ 5 సంవత్సరాల లోపు పిల్లలను సంరక్షించేందుకు ఇంటివద్ద ఎవరూ లేనిచో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని ప్రతి మండల కేంద్రంలో ఒక బేబీ కేర్ సెంటర్ ఏర్పాటు చేయడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించాలని...,
3. బాలికలు,విద్యార్థులు మీద రోజు రోజుకూ అఘాయిత్యాలు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయని తెలిసిన వారే ఇలాంటి పనులు చేస్తున్నారని పాఠశాల స్థాయి నుండే ఆడ పిల్లలకు వీటిపై అవగాహన కలిగేలా గుడ్ టచ్,బ్యాడ్ టచ్ గురించి ఇతర జాగ్రత్తల గురించి అలాగే మగ పిల్లలకు కఠిన చట్టాలు,నైతిక విలువలు గురించి అన్ని స్కూల్స్ లో సంవత్సరానికి ఒకసారైనా చైతన్య సదస్సులు ఏర్పాటు చేసి సరైన అవగాహన కల్పించాలని...,
4. ప్రతి హైస్కూల్ లో బాలికల సంరక్షణ,వ్యక్తిగత సమస్యలు,అవసరాలు చెప్పుకోవడం కోసం ఒక మహిళా ఉపాధ్యాయురాలిని తప్పనిసరిగా కేటాయించాలని...,
5. డ్రాపౌట్స్ లో అధికంగా బాలికలే ఉంటున్న దృష్ట్యా ఈ సమస్య ఉన్న ప్రాంతాల్లో అధికారులు,ప్రజలు తల్లిదండ్రులతో కలిసి అవగాహన సదస్సులు పెట్టి బాలికలందరూ చదువుకునేలా చూడాలని...,
6.ఎన్ని చట్టాలు వచ్చినా వరకట్న చావులు,బాల్య వివాహాలు,అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయని ఈ సమస్యల పరిష్కారానికి ప్రతి మూడు నెలలకోసారి గ్రామ/వార్డు స్థాయిల్లో క్రమం తప్పకుండా సమావేశాలు ఏర్పాటు చేయడం ద్వారా అందరిలో పూర్తిస్థాయి అవగాహన,చైతన్యాన్ని పెంపొందించాలని కోరడమైనది.
0 comments:
Post a Comment