IT Gratuity: గ్రాట్యుటీ మీద (TAX) పన్ను ఉంటుందా?

 ఉద్యోగం నుంచి పదవీ విరమణ పొందుతు న్నప్పుడు పెద్ద మొత్తంలో గ్రాట్యుటీ రూపంలో డబ్బు చేతికందుతుంది. అయితే ఈ మొత్తాన్ని కొన్ని షరతులతో ఆదాయం పన్ను (ఐటీ) నుంచి మినహాయిస్తారు. గ్రాట్యుటీ మొత్తాలను పన్ను పరిధిలోకి తీసుకురావడానికి ముందు ఉద్యోగులను ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులుగా విభజి స్తారు. రిటైర్మెంట్ సమయంలో వచ్చే గ్రాట్యుటీ మీద పన్ను నిబంధనలు ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు వేర్వేరుగా ఉన్నాయి. ముఖ్యంగా ప్రైవేట్ ఉద్యోగులను గ్రాట్యుటీ చట్టం 1972t  పరిధిలో వచ్చే వారు, రానివారుగా విభజించారు.

ప్రైవేటు ఉద్యోగులకు రూ.20 లక్షలకు మించి గ్రాట్యుటీ ఉండరాదు.

ఈ మొత్తం దాటితే పన్ను పరిధిలోకి వస్తుంది.

రూ.20 లక్షలకుపైగా గ్రాట్యుటీ వస్తే చార్టెడ్ అకౌంటెంట్ లేదా టాక్స్ కన్సల్టెంట్ను సంప్రదించి ఐటీ రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది.

Posted in: , ,

Related Posts

0 comments:

Post a Comment

Top