AP JAC, JAC Amaravathi భవిష్యత్ కార్యాచరణ కొరకు ఉద్యోగ సంఘాల సమావేశం

 ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు అత్యవసరంగా సమావేశమయ్యారు. రెవెన్యూ భవన్‌లో అమరావతి జేఏసీ, ఏపీఎన్జీవో భవన్‌లో ఎన్జీవో జేఏసీ కార్యవర్గ సభ్యులు విడివిడిగా భేటీ అయ్యారు. పీఆర్సీ అమలు, సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు కార్మికుల క్రమబద్దీకరణ తదితర డిమాండ్లతో పాటు వివిధ సమస్యలపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. పీఆర్సీపై ఇప్పటికే డెడ్‌లైన్ విధించిన ఏపీ జేఏసీ నేతలు  సమావేశం ముగిసిన తర్వాత భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశం.. ఇటీవల ఉద్యోగుల డిమాండ్ల సాధన కోసం రెండు జేఏసీ లు కలిసి ఉద్యమ బాట పట్టాయి. ప్రభుత్వం నిర్వహించిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ నుండి కూడా పీఆర్సీ కోసం డిమాండ్ చేస్తూ బయటకు వచ్చేసిన సంగతి మనందరికీ తెలిసిందే ఈ సమావేశం అనంతరం వీరి కార్యాచరణ తెలిసే అవకాశం ఉన్నది.

 రాష్ట్ర సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్న   రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బొప్పరాజు వెంకటేశ్వర్లు , ఆంధ్ర ప్రదేశ్ ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షులు మరియు APJAC,అమరావతి కో చైర్మన్ శ్రీ జి.వి.నారాయణ రెడ్డి.


ఉద్యమ కార్యాచరణ ను ప్రతిపదిస్తూ ప్రసంగిస్తున్న సెక్రెటరీ జనరల్ G హృదయ రాజు

ఏపీ జేఏసీ అమరావతి బొప్పరాజు మీడియా మీట్:

ఏపీ జేఏసీ అమరావతి బొప్పరాజు మీడియా మీట్ నిర్వహించి వివరాలు వెల్లడించారు. రూ.1600 కోట్ల చెల్లింపులపై చర్చించామని.. జేఏసీ తరపున సాయంత్రం కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. 94 ఉద్యోగ సంఘాలతో చర్చించి కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఉమ్మడి వేదికగా కార్యాచరణ ప్రకటిస్తామని బొప్పరాజు స్పష్టం చేశారు.

జగన్ జోక్యం చేసుకోరేం..!

'ప్రభుత్వం పీఆర్సీ నివేదికను బయటపెట్టకుండా ఉద్యోగులను అవమానిస్తోంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఉద్యోగులను చిన్నచూపు చూస్తున్నారు. ఉద్యోగ సంఘాలతో ఏ రోజైనా ఆర్థికమంత్రి చర్చించారా?. ఉద్యోగుల సమస్యలపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎందుకు జోక్యం చేసుకోవడం లేదు?. పీఆర్సీ నివేదిక ఇవ్వకుండా పీఆర్సీ ప్రకటన చేస్తే ఒప్పుకోం. రాష్ట్రవ్యాప్తంగా 94 ఉద్యోగ సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఉద్యోగులకు 1600కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాలి. పేదల కోసం పని చేసే ఉద్యోగుల పట్ల మంత్రి కించపరిచేలా మాట్లాడతారా..?. రాష్ట్ర వ్యాప్తంగా 94 ఉద్యోగ సంఘాలు ఆందోళనలకు సిద్ధం అవుతున్నాయి. వెంకట్రామిరెడ్డి అనుభవ రాహిత్యంతో ప్రకటన ఇస్తున్నారు. వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం చెల్లించిన డీఏలతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడ్డ డీఏలను చెల్లించాలి. ఇవాళ కీలకమైన ప్రకటన ఉండబోతోంది' అని బొప్పరాజు మీడియాకు వెల్లడించారు

Note: సమావేశం తాజా వివరాలు ఎప్పటికప్పుడు ఇదే పేజీ నందు  అందించబడును




Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top