ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాల నేతలను ప్రభుత్వం చర్చలకు పిలిచింది. ప్రభుత్వం నుంచి పే రివిజన్ కమిషన్ నివేదిక కోసం సచివాలయంలోఆరు గంటల పాటు ఎదురు చూసినా స్పందన లేకపోవడంతో ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి.గురువారం సమావేశం అయి ఉద్యమ కార్యాచరణ ఖరారు చేసుకోవాలని నిర్ణయించాయి. అయితే వీరు సమావేశం కావడానికి ముందే ప్రభుత్వం వీరిని చర్చలకు ఆహ్వానించింది. ఉదయం 11 గంటలకు ఉద్యోగ సంఘాల నేతలందరూ సచివాలయంలో భేటీకి హాజరు కావాలని సందేశం పంపించారు. జీఎడీ సర్వీసెస్ సెక్రటరీతో వీరు సమావేశం కానున్నారు.
అయితే ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నట్లుగా పీఆర్సీ నివేదిక ఇస్తారా లేదా అన్నదానపై స్పష్టత లేదు. అయినా ప్రభుత్వమే పిలిచింది కాబట్టి సమావేశానికి వెళ్లాలని నిర్ణయించారు.
ఒక వేళ ఈ సమావేశంలో పీఆర్సీ నివేదిక ఇవ్వకపోతే మాత్రం వెంటనే సమావేశమే ఉద్యమ కార్యాచరణ ఖరారు చేసుకుటామని ఉద్యోగ సంఘ నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం బొప్పరాజు వెంకటేశ్వర్లు, బండి శ్రీనివాసరావు నేతృత్వంలో రెండు జేఏసీలుగా ఉద్యోగ సంఘాల నేతలు ఉన్నారు. ఈ రెండు జేఏసీలు కలిసి పని చేస్తున్నాయి.ప్రభుత్వ నిర్ణయం మరికొంత సమయం లో తెలిసే అవకాశం ఉన్నది.
0 comments:
Post a Comment