MLC Sri K Narasimha Reddy
- కోవిడ్ తో మరణించిన ఉపాధ్యాయ కుటుంబాల అందరికీ కారుణ్య నియామకాలు ఇవ్వాలి
- ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరిన
- ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి
కోవిడ్ తో మరణించిన ఉపాధ్యాయ, ఉద్యోగుల కుటుంబంలోని ఒకరికి నిబంధనలను సవరించి అందరికీ కారుణ్య నియామకాలు ఇవ్వడానికి ప్రత్యేక ఉత్తర్వులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ ను కలసి కోరినట్లు ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి తెలిపారు. నవంబర్ 30 తేదీ లోపు కారుణ్య నియామకాలు ఇవ్వడానికి సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని వారి దృష్టికి తీసుకొని వచ్చారు. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనలు సవరించి అన్ని శాఖలను కలెక్టర్ పరిధిలోనికి తీసుకొని వచ్చి ఖాళీలు భర్తీ చేయాలని , ఖాళీలు లేనప్పుడు సూపర్ న్యూమరీ పోస్టు ల్లో నియమించాలని కొరినట్లు తెలిపారు.ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ 72, 73,74 అమలు, మోడల్ స్కూల్స్ టీచర్లకు 010 హెడ్ ద్వారా వేతనాలు చెల్లింపు, KGBV ,SSA టీచర్లు సిబ్బందికి మినిమం టైం స్కేల్ వర్తింపు, పాలిటెక్నిక్ అధ్యాపకుల 7 వ వేతన స్కేలు, కాంట్రాక్ట్ అధ్యాపకులు కు నష్టం కలగకుండా చూడాలని, మున్సిపల్ టీచర్ల పిఎఫ్ ఖాతాలు ప్రారంభానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరగా సానుకూలంగా స్పందించారని తెలిపారు .
కత్తి నరసింహారెడ్డి ఎమ్మెల్సీ
0 comments:
Post a Comment