సునామీ సుడిగుండంలో (నేడు సునామీ అవగాహనా దినోత్సవం)

 సునామీ సుడిగుండంలో (నేడు సునామీ అవగాహనా దినోత్సవం)రచయిత శ్రీ యం.రాం ప్రదీప్ గారు

ప్రకృతి వైపరీత్యాలలో సునామీ భయంకరమైనది.సునామీలు సముద్రంలో ఏర్పడే భూకంపాలు వల్లసంభవిస్తాయి.ఈ భూకంపాల వల్ల

అలలు విజృంభించి సముద్ర ఉపరితలంపైకి ఉవ్వెత్తున ఎగిసిపడుతాయి. ఫలితంగా భారీ స్థాయిలో ఆస్తి,ప్రాణ నష్టం వాటిల్లుతుంది.

 వాతావరణ మార్పుల వల్ల ఎప్పుడు ఎలాంటి విపత్తు విరుచుకుపడుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. తీరప్రాంతాల ప్రజల్లో ఎక్కువ మంది సముద్రంపై ఆధారపడి జీవిస్తారు. ఇలాంటి వారిపై సముద్రం ఎప్పుడు విరుచుకుపడుతుందో తెలియని పరిస్థితులు ఉంటాయి. దీంతో సునామీ వంటి వాటిపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రతీ సంవత్సరం నవంబర్ 5 న ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవాన్ని జరుపుకుంటారు. 

గత 100 ఏళ్లలో సుమారు 60 సునామీలు ఏర్పడ్డాయని అంచనా.


2004 డిసెంబర్ 26న ఏర్పడిన సునామీ ఆధునిక కాలంలో ఏర్పడిన వాటిల్లో అతి పెద్దది.ఈ సునామీ తాకిడికి లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.


గురువులు ప్రయోగాత్మకంగా పాఠాలు బోధిస్తే విద్యార్థులు వాటిని తమ నిత్య జీవితంలో ఎంత ప్రభావంతగా అన్వయించుకుంటారో ఓ విద్యార్థిని నిరూపించింది.ఈ ఘటన ప్యుకేట్ థాయిలాండ్, మియఖోలో 2004 డిసెంబర్ లో జరిగింది. ఇంగ్లాండ్ లోని సర్రే ప్రాంతానికి చెందిన టిల్లీ స్మిత్, తన తల్లితండ్రులు , చెల్లితో బీచ్‌లో ఉంది. కొన్ని రోజుల కింద పాఠశాలలో సునామి గురించి చదివి వుండడం వల్ల ఆమె సునామి అనివార్యం అని తలచి తన కుటుంభ సభ్యులను హెచ్చరించింది. ఆమె తల్లితండ్రులు తీరంలో ఉన్న ఇతర ప్రజలను , హోటల్ సిబ్బందిని సునామి వచ్చే ముందే హెచ్చరించారు. స్మిత్ చాలా మంది ప్రాణాలు కాపాడడంలో తాను భూగోళశాస్త్రంలో నేర్చుకున్న పాఠం వల్లేనని ఆమె తెలిపింది. ఈ విధంగా ఆమె తన భూగోళ శాస్త్ర ఉపాధ్యాయుడు ఎం అర్. ఆండ్రూ కేర్నీ కి మంచి పేరు తెచ్చింది.ఆయన సునామీ వచ్చే కొద్దిరోజుల ముందే సునామీ గురించి వీడియో రూపంలో స్మిత్ కి వివరించారు.


ప్రపంచవ్యాప్తంగా 700 మిలియన్ల మంది ప్రజలు తీర ప్రాంతాలు లేదా లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్నారని అంచనా. వీరే తుఫానులు, వరదలు, సునామీలకు ఎక్కువగా గురవుతారు. తీర ప్రాంత ప్రజలు జీవనోపాధి కోసం సముద్రంపైనే ఆధారపడతారు. దీంతో వారి ప్రాణాలకు, జీవనోపాధికి ప్రభుత్వం భరోసా ఇవ్వాలి. రోజురోజుకూ మడ అడవులు తగ్గి పోతున్నాయి.ఇందుకు అక్కడ పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపట్టాలి. ప్రమాదం తీవ్రతను తగ్గించడానికి, వారి పునరావాసం కోసం  ప్రభుత్వాలు ముందస్తు ప్రణాళికను రూపొందించాలి.

సముద్ర తీర ప్రాంతాల్లో సునామీ హెచ్చరిక కేంద్రాలు ఏర్పాటు చేయాలి. విద్యార్థులకు సునామీ గురించి అవగాహన కలిగించాలి.తద్వారా సునామీలని ఆపలేము కానీ,వాటి తీవ్రతని తగ్గించకల్గుతాము.

తిరువూరు

9492712836

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top