Life Certificate: యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ పై కొన్ని ముఖ్యవిషయాలు...

Life Certificate: Pensioners Live Certificate: ప్రభుత్వ పెన్షనర్లు యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ ను 1జనవరి నుండి ఫిబ్రవరి 28లోపున  ఖచ్చితంగా సమర్పించాలి.గతంలో లైఫ్ సర్టిఫికెట్ మన పెన్షన్ అక్కంట్ ఉన్న బ్యాంకు/ట్రెజరీలో ఇస్తే సరి పోయేది. ప్రస్తుతం ఆవిధానం లేదు.

Life Certificate: Pensioners Live Certificate

Life Certificate: యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ పై కొన్ని ముఖ్యవిషయాలు... 

  యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ (AVC) కేవలం ఆన్లైన్ లోనే సబ్మిట్ చేయాలి.* దీనికొరకు మనం మన  ట్రెజరీలో గాని ఆన్లైన్ సెంటర్ లోగానీ మన cfms సైట్ ద్వారా లేదా జీవన్ ప్రమాణ్ పోర్సల్ ద్వారా కానీ AVC సబ్మిట్ చేయవచ్చు.

AVC submitt చేయడానికి మన దగ్గర ఉండవలసినవి

1.Aadhar card

2.Aadhar linked Cell No.

3.PPO No.

4.CFMS No.

5.cfms Password.

1. జీవన్ ప్రణామ్:— _మన ఆధార్ నెంబరు కు మన సెల్ నెంబర్ లింక్ అయి ఉండాలి.  ఇ మెయిల్ ఉంటే మంచిది. కంపల్సరీ కాదు. మన ఆధార్ ,రిజిష్టర్ సెల్ నెంబర్ ఎంటర్ చేస్తే సెల్ కు ఓ టి పి వస్తుంది. ఆ ఓటిపి ఎంటర్ చేస్తే బయోమెట్రిక్ స్కేన్  ఇవ్వమంటుంది.  ఫింగర్ ప్రింట్ మేచ్ అయితే  డిటేల్స్ వస్తాయి. ఆ డిటేల్స్ వెరిపై చేసి వివరాలు సరిపోయినవని టిక్ చేస్త్తే మన పింగర్ ప్రింట్ స్కేన్ అడుగుతుంది. మన పది వేళ్ళలో ఏదోఒక పింగర్ స్కేనర్ పై ఉంచితే స్కేన్ అయి మన ఫోటోతో కూడిన AVC , మన జీవన్ ప్రణామ్ ID వస్తుంది. మనం ప్రింట్ కావాలనుకుంటే జీవన్ ప్రణామ్ ID ద్వారా జీవన్ ప్రమాణ్ పోర్సల్ లో లాగిన్ అయి ప్రింట్ తీసుకోవచ్చు. 

గమనిక1 :-జీవన్ ప్రమాణ్ పోర్సల్ సంవత్సరమంతా నిరంత రాయంగా పనిచేస్తూ ఉంటుంది. మన రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు  జనవరి- పిబ్రవరి నెలలలో ఇస్తేనే సంబంధిత ట్రెజరీ అధికారులకు ఏ వి సి  వివరాలు చెరతాయి.

గమనిక2 :— నవంబరు- డిశంబరు నెలలో  జీవన్ ప్రమాణ్ పోర్సల్ లో  యాన్యువల్ వెరిఫికేషన్ సబ్మిట్ చేసిన వారు మరలా జనవరి - పిబ్రవరి లో నమోదు చేసుకోవలసి ఉంటుంది.

2. CFMS సైట్  http://cfms.ap.gov.in 

       సైట్ ఓపన్ చేసి లాగిన్ క్లిక్ చేయండి. ఓపన్ అయిన విండోలో cfms id ,Password ద్వారాలాగాన్ కాగానే  cfms Home page విండో ఓపన్ అవుతుంది. దానిలో Biometric/ Iris Device Configuration , ESS అనేవి కనిపిస్తాయి. మనం  బయోమెట్రిక్ option పై క్లిక్ చేయాలి. అక్కడ మన యూజర్ ఐ డి ,User Name , Aadhar Number desplay అవుతాయి. తరువాత Selected Device అనే option దగ్గర మనం ఉపయోగిస్తున్న బయోమెట్రిక్ స్కేనర్  సెలెక్ట్ చేయండి. (మనసిస్టంలో ఇప్పటికే బయోమెట్రిక్ డివైజ్ ఇన్టాల్ చేసి ఉండాలి.) క్రింద ఉన్న సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.

Aadhar Biometric Finger Verification వస్తుంది. మన 10 ఫింగర్స్ లో ఏదో ఒక వేలు స్కానర్ పై ఉంచి స్కాన్ చేయండి. సిస్టమ్ మన ఫింగర్ స్కేన్  మేచ్ అయితే యువర్ స్కేన్ సక్సెస్ పుల్ అని వస్తుంది. తరువాత మనం ESSలోకి వెళ్ళి చూస్తే 

1) Persional Information

2)Leave management.

3)Payroll Service

4)Miscellaneous Requests

5)AGLI అనే ట్యేబ్స్ కనబడతాయి.

ఇందులో 4వ అంశం Miscellaneous Requests లో Annual Verification Certificate ( AVC) option పై clik చేయాలి.అక్కడ select any one అనే దానిపై క్లిక్ చేస్తే 3 options CFMS/Aadhar/Bank accout వస్తాయి. వాటిలో ఓ option click చేసీ details ఇస్తే మన డిటేల్స్ వస్తాయి.  డిటేల్స్ ప్రక్కన ఉన్న Validate button click చేస్తే బయోమెట్రిక్ స్కేన్  ఇవ్వమంటుంది.  ఫింగర్ ప్రింట్ మేచ్ అయితే  డిటేల్స్ వస్తాయి.  ఆ డిటేల్స్ వెరిపై చేసి వివరాలు సరిపోతే Submitt click చేయాలి.  ఆ మన వివరాలు మన STOగారి పంపబడతాయి. అక్కడ వెరిఫికేషన్ అయ్యాక   AVC Approved అనే  చూపిస్తుంది. cfms site లో AVC సబ్మిట్ చేయడం మంచిది. ఈ సైట్ లో మన AVC approve అయితే ఆవివరాలు ఖచ్చితంగా అక్కడ చూపబడి సబ్మిషన్ గడువు ముగిసాకా మన AVC రాలేదు కాబట్టీ పెన్షన్ ఆపాం అనే అవకాశం ట్రెజరీ వారికి ఉండదు. మనం మన AVC approved/ Not approved అనే అంశం మనమే గమనించుకోగలుగుతాం.జీవన్ ప్రమాణ్ పోర్సల్ లోనో, మరోవిధంగానో మనం మన AVC సబ్మిట్ చేసినపుడు ట్రెజరీ వారు దృవీకరించేవరకూ Approve అయింది లేనిది మనకు తెలియదు. 

                   తెలంగాణ,హిమాచల్ ప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాలలో ఆ రాష్ట్ర ప్రభుత్వాలవారు ప్రత్యేకమైన యాప్లు తయారు చేసిఫోన్లద్వారానే ఏవిసి సమర్పించే అవకాశాలు కల్పించారు. మనకు ప్రస్తుతానికి అటువంటి ప్రత్యేకమైన యాప్లు రాలేదని గమనించగలరు.

                                                                                       కెకెవి నాయుడు అమలాపురం,9490905356

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Capacity Building Training & Registration Links
Telugu & English News Papers
Ammavodi Eligibility Lists
FA & SA Marks Entry
Read Along App and May 2021 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top