LIP Top: లిప్ టాప్ గా బోధన త్రిభాషా సామర్థ్యం పెంపునకు స్కూళ్లలో ప్రత్యేక కార్యక్రమం

లిప్ టాప్ గా  బోధన

 100 రోజులు .. 500 పదాలు

త్రిభాషా సామర్థ్యం పెంపునకు స్కూళ్లలో ప్రత్యేక కార్యక్రమం

  • 10 నుంచి శ్రీకారం
  •  100 రోజుల పాటు ప్రణాళిక అమలు

పిల్లల్లో భాషా సామర్థ్యం పెంచేందుకు ఓ కార్యక్రమాన్ని సిద్ధం చేశారు . వంద రోజుల్లో 500 పదాలు నేర్పించేలా దీనిని రూపొందించారు . కోవిడా కారణంగా అభ్యస నంలో ఏర్పడిన లోటును భర్తీ చేసేందుకు దోహదపడే ఈ కార్యక్రమాన్ని లాంగ్వేజ్ ఇంప్రూ వ్మెంట్ ప్రోగ్రామ్ ( లిప్ ) గా వ్యవహరించను న్నారు .

 1 నుంచి 10 తరగతుల విద్యార్థులకు రోజూ తెలుగు , హిందీ , ఇంగ్లిష్ భాషల్లో కొన్ని పదాలు నేర్చిస్తారు . 

1.2 తరగతుల వారికి తెలుగు , ఇంగ్లిష్ లో రోజుకు 2 చొప్పున ,3 నుంచి పదో తరగతి వరకూ విద్యార్థులకు మూడు భాషల్లో 5 చొప్పున పదాలు నేర్పిస్తారు .

 జగనన్న విద్యాకానుక డిక్షనరీలో ఈ పదాలు ఉంటాయి . వంద రోజుల పాటు ప్రయోగాత్మకంగా మూడు జిల్లాల్లో లిప్ అమలు చేయనున్నారు

*సుమారు 200 నుంచి 500 పదాలు తెలిసి భాషపై పట్టు సాధించేలా చూస్తారు . ఉచ్ఛారణ దోషాలను కూడా సవరించ నున్నారు

*పాఠశాలల్లో అమలు ఇలా ..

*ప్రతి పాఠశాలలో రోజూ 5 నిమిషాలు లిప్ కోసం కేటాయిస్తారు . 

• బోర్డుపై పదాలు కనిపించేలా ఉంచి , మెదడుపై ముద్ర వేసేలా చూస్తారు . 

• భాషా ఉపాధ్యాయులు ఈ బాధ్యతలను నిర్వర్తిస్తారు .. 

• 1 , 2 ఒక గ్రూప్ .. 3 , 4 , 5 తరగతులు మరో గ్రూప్ . 6 , 7 , 8 తరగతులు ఇంకో గ్రూప్ ... 9 , 10 తరగతులను ఇంకో గ్రూప్ ను విభజించి అభ్యసనా సామర్థ్యాలు పెరుగుతాయి లిప్ కార్యక్రమం భాషా నైపుణ్యాల సాధనకు ఉపకరించే అద్భుతమైన కార్యక్రమం . ప్రతి పిరియడ్లోనూ అంత ర్భాగమే కనుక ఉపాధ్యాయునికి భారమయ్యే అవకాశం లేదు .

*ఈ నెల 10 నుంచి మార్చి 31 వరకూ *లిప్* అమలు చేస్తారు . వారానికోసారి 15 పదాలకు 15 మార్కులకు 10 నిమిషాల వ్యవధిలో స్వయం నిర్ధారణ పరీక్ష నిర్వహిస్తారు . 

13 నుంచి 15 మార్కులు

 *సాధించిన విద్యార్థికి - A

 *10 నుంచి 12 వస్తే  - B

   *7 నుంచి 9 వస్తే     - C

   *4 నుంచి 6 వస్తే    -  D

 *4 కంటే తక్కువ వస్తే - E

గ్రేడుగా కేటాయిస్తారు . 

• ప్రతి వారం అధికారులు సమీక్షించి వివరాలను ఆర్జేడీకి నివేదించాలి .

 • 85 నుంచి 100 శాతం సగటు వచ్చిన విద్యార్థుల స్కూలుకు ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తారు . 

*మిగిలిన స్కూళ్లకు కూడా రేటింగ్ ఉంటుంది. ఆ మెరుగైన ఫలితాలు సాధించిన స్కూలుకు సర్టిఫి కెట్ ఇస్తారు .

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top