Quantum of Pension: క్వాటమ్ ఆఫ్ పెన్షన్ గురించి కొన్ని వివరాలు

9th Pay Commission రిపోర్టు ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు GOMS No 100 Finance (Pension-1) Dept. dt.6/4/2010 లో  పెన్షనర్లు , ఫేమలీ పెన్షనర్లకు వయస్సు ఆధారంగా 75 సంవత్సరాల వయస్సు పై బడినవారికి అడిషనల్ క్వాటమ్ ఆఫ్ పెన్షన్ మంజూరు ఉత్తర్వులు జారీ చేసిరి. రెగ్యులర్ ఉద్యోగుల బేసిక్ పే  ప్రతీ సంవత్సరం వార్షిక ఇంక్రిమెంట్ మంజూరుతో పెరుగుతూ ఉంటుంది.కానీ పెన్షనర్స్ బేసిక్ పెన్షన్ మార్పు PRCలలో మాత్రమే మారుతుంది. దీనివల్ల సీనియర్ పెన్షనర్లకన్నా వెనుక రిటైర్ అయిన జూనియర్ పెన్షనర్లు ఎక్కువ పెన్షన్ పొందడం జరుగుతుంది. పైగా వయస్సురీత్యా పెద్దవారగుతున్న పెన్షనర్లు , ఫేమలీ పెన్షనర్లు వైద్యంపై  ఎక్కువ ఖర్చు పెట్టవలసిన పరిస్ధితి ఉంటుంది.  ఈ అంతరం కొంతమేర తగ్గించడానికి Additional Quantum of Pension మంజూరుక పైన తెల్పిన జివో ద్వారా  ఉత్తర్వులు ఇచ్చియున్నారు 

Additional Quantum of Pension 75 సంవత్సరాల వయస్సు పైబడిన పెన్షనర్లు , ఫేమలీ పెన్షనర్లుకు వారి వయస్సున బట్టి బేసిక్ పెన్షన్ పై ఎంతశాతం పెంచి ఇవ్వాలో ఈ జివో లు ఇవ్వడం జరిగింది.

75 to 80 Age Group కు 15%

80 to 85 Age Group కు 20%

85 to 90 Age Group కు 25%

90 to 95 Age Group కు 30%

95 to 100 Age Group కు 35%

100 Above 50% మంజూరు చేస్తారు.

Additional Quantum of Pension బేసిక్ పెన్షన్లో మెర్జి చేయరు. సెపరేట్ గా చూపుతారు.

Additional Quantum of Pension పై  డి ఆర్ కూడా ఇవ్వబడుతుంది.

ఐ ఆర్ రాదు.

ఉదాహరణ:— 75 టు 80 సంవత్సరాల మద్య ఉన్న పెన్షనర్ / ఫెమలీ పెన్షనర్ బేసిక్ పెన్షన్ 30వేలనుకుందాం. వారికి మంజూరయ్యే Additional Quantum of Pension 30,000 x 15% = 4500  వీరి పే స్టబ్ లో

 బేసిక్ పెన్షన్ 30,000 AQP  4,500  చూపి అప్పటికి అమలులో ఉన్న డి ఆర్  లో కలిపి చూపుతారు.

 Additional Quantum of Pension పెన్షనర్ /ఫేమలీ పెన్షనర్ 75 సంవత్సరాల వయస్సు పూర్తగు   నెల మొదటి తేదీనుండి మంజూరు చేస్తారు.

ఉదాహరణకు ఒక వ్యక్తి 17/8/2010 నాటికి 75సం॥ వయస్సు పూర్తయిందనుకుంటే వారికి Additional Quantum of Pension 1/8/2010 నుండి మంజూరు చేస్తారు.

సర్వీసు పెన్షనర్ పుట్టినతేది పిపివో లో/ ఆఫీసు రికార్డ్స్ లో ఉంటుంది కాబట్టి అట్టి సర్వీసు పెన్షనర్ 75 సంవత్సరాల వయస్సు పూర్తవగానే సంబంధిత Sub Treasury  STO గారు  Additional Quantum of Pension మంజూరు చేస్తారు

ఫేమలీ పెన్షనర్స్ కు సంబంధించి పిపివో లో పుట్టిన తేదీ నోట్ అయి ఉంటే ఇబ్బంది లేదు కానీ పెన్షన్ ప్రపోజల్స్ పంపే సమయంలో కొందరు ఫేమలీ పెన్షనర్ పుట్టిన తేదీ కాక వయస్సు నోట్ చేసి ఉంటే /లేదా వయస్సు నిర్ధారణకు సరయిన ఆధారాలు లేకుంటే అట్టి వారి జనన దృవీకరణ ఆఫీసు రికార్డులలో లభ్యం కానందున  పెన్షన్ Disbursing Officer STO ఫెమలీ పెన్షనర్ జననదృవీకరణ కు సంబందించిన దృవపత్రాలను అందించమని కోరతారు. 

జనన దృవీకరణకు కొన్ని పద్దతులను నిర్ధేశిస్తూ Govt Memo No 17919/82/A2PSC2010 Finance PSC Dpt. dt.17/10/2010 ఉత్తర్వులు జారీ చేసియున్నారు. దీని ప్రకారం ఫేమలీ పెన్షనర్ తనదగ్గర ఉన్న మెట్రిక్యులేషన్ సర్టిఫికెట్ / పాన్ కార్డ్ / Indian Passport. /Driving Licence / Study Certificate with DOB ఇవి ఏమి లభ్యంకాక పోతే District Medical Officer/ Standing Medical Board వారిచ్చిన దృవపత్రంలో ఏదో ఒకటి 4కాపీలు సమర్పించిన మీదట  వారి PPO లో పుట్టినతేదీ నోట్ చేసి సంబందిత STO గారు Additional Quantum of Pension మంజూరు చేస్తారు.

Additional Quantum of Pension 2015PRC లో కూడా 2010 PRC లో 100 GO ద్వారా ఇవ్వబడిన Age Group % కొనసాగిస్తూ AP ప్రభుత్వం GO MS No 66 Finance HRM VI Pension dt 12/6/2015 ఉత్తర్వులు జారీ చేసి యున్నారు.

దరిమిల 6/5/2017 న  AP Pensiiners Association , AP JAC వారు చేసిన రిప్రజంటేషన్ అనుసరించి మన రాష్ట్ర ప్రభుత్వం వారు ఏజ్ గ్రూప్ సవరణ చేస్తూ GO MS No 6 Dt.12/1/2019 జారీ చేసిరి .దీనిననుసరించి ఈ క్రింది చూపిన విధంగా పెన్షనర్ / ఫేమలీ పెన్షనర్ కు % Additional Quantum of Pension  మంజూరు చేయబడుతుంది.

70 to 75  Age Groupకు 10%

75 to 80 Age Group కు 15%

80 to 85 Age Group కు 20%

85 to 90 Age Group కు 25%

90 to 95 Age Group కు 30%

95 to 100 Age Group కు 35%

100 Above 50% మంజూరు చేస్తారు.

70 సంవత్సరాల వయస్సు  దాటిన జనన దృవీకరణ నిర్ధారణ లేని వారు పైన తెల్పిన జనన దృవీకరణలో ఏదో ఒక దృవీకరణ పత్రం 4సెట్లు , 70సంవత్సరాల వయస్సు నిండిన తేదీ నుండి Additional Quantum of Pension మంజూరు చెయమని తమ పిపివో వివరాలు వివరిస్తూ ఒక లేఖను సంబంధిత STO గారికి అందచేస్తే వారు తదుపరి చర్యలు తీసుకుంటారు.

ప్రస్తుతం CFMS పోర్సల్ ద్వారా ఆన్ లైన్ లో ESS నందు మన వివరాలు, జననదృవీకరణ స్కేన్ కాపీ అప్ లోడ్ చేసి అనంతరం ఆ వివరాలను దరఖాస్తును  తదుపరి చర్య కొరకు STO లకు అందించ వలసి ఉంటుంది.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top