మీలో ఎవరు కోటీశ్వరుడు లో కోటి రూపాయలు గెల్చుకున్న SI రవీంద్ర ఎదుర్కొన్న ప్రశ్నలు - సమాధానాలు.

రాజా రవీంద్రను హాట్ సీట్‌కి తీసుకెళ్లిన ప్రశ్న.. 

హైదరాబాద్ నుంచి వాటి దూరాల ప్రకారం, ఈ నగరాలను తక్కువ నుండి ఎక్కువకు అమర్చండి?

A)న్యూయార్క్  

B)ముంబయి  

C)దుబాయ్  

D)విజయవాడ

జ: DBCA


రూ.1,000 ప్రశ్న

సాధారణంగా వీటిల్లో దేనిమీద ఎక్స్పైరీ డేట్ ఉండదు? 

ఆధార్ కార్డు, 

పాస్ పోర్టు, 

డెబిట్ కార్డు, 

డ్రైవింగ్ లైసెన్స్.

జ: ఆధార్ కార్డు


రూ.2,000 ప్రశ్న

ఈ విగ్రహంలో కనిపిస్తున్నది ఎవరు? మహా వీర, 

బాహుబలి, 

బుద్దుడు, గురునానక్.

జ: బుద్దుడు


రూ.3,000 ప్రశ్న

భారతదేశం కన్నా ఎక్కువ జనాభా ఉన్న దేశాల సంఖ్య ఎంత? 

ఒకటి, 

రెండు, 

మూడు, 

నాలుగు.

జ: ఒకటి


రూ.5,000 ప్రశ్న

2019లో ఇండియన్ హోం మినిస్టర్ గా బాధ్యతలు చేపట్టింది ఎవరు? 

నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కారీ, 

రవిశంకర్ ప్రసాద్, 

అమిత్ షా.

జ: అమిత్ షా


రూ.10,000 ప్రశ్న

కత్తి సాము, సిలంబం, కలరిపయట్టు అనేవి దేనికి ఎగ్జాంపుల్స్? 

నృత్యం, 

సంగీతం, 

చిత్రలేఖనం, 

మార్షల్ ఆర్ట్స్.

జ: మార్షల్ ఆర్ట్స్


రూ.20,000 ప్రశ్న

రేడియో ప్రసారాల్లోని ఏఎమ్.ఎఫ్ఎమ్ లో ఎమ్ దేనిని సూచిస్తుంది? మీటర్, 

మాడ్యులేషన్, మాగ్నిట్యూడ్, మిషన్.

జ: మాడ్యులేషన్


రూ.40,000 ప్రశ్న

ఏపీలోని అంతర్వేది దగ్గర బంగాళఖాతంలో కలిసే నది ఏది? 

కృష్ణ, 

తుంగభద్ర, 

పెన్నా, 

గోదావరి.

జ: గోదావరి


రూ.80,000 ప్రశ్న

ఏ మానవ అవయవాల్లో ఐరిస్, లెన్స్, రెటీనా ఉంటాయి? ఊపిరితిత్తులు, 

చెవులు, 

కళ్లు, 

కడుపు.

జ: కళ్లు


1,60,000 ప్రశ్న

హిందూ పురాణాల్లో వీరిలో కర్ణుడి గురువు ఎవరు? వ్యాసుడు, 

పరశురాముడు, 

పాండు రాజు, 

కృష్ణుడు.

జ: పరశురాముడు


రూ.3,20,000 ప్రశ్న

ఆగస్టు 2021లో ఆపరేషన్ దేవిశక్తిలో భాగంగా ఏ ప్రాంతం నుండి భారత ప్రభుత్వం 800 మంది జనాన్ని తరలించింది? అఫ్ఘనిస్తాన్, 

ఇరాక్, 

సిరియా, మయన్మార్.

జ: అప్ఘనిస్తాన్


రూ.6,40,000 ప్రశ్న

భారత్ స్వాతంత్ర్యం పొందినప్పుడు బ్రిటీష్ వైస్రాయ్ ఎవరు? 

లార్డ్ వేవెల్, 

లార్డ్ మౌంట్ బాటెన్, 

లార్డ్ ఎల్గిన్, 

లార్డ్ రిప్పన్.

జ: లార్డ్ మౌంట్ బాటెన్


రూ.12,50,000 ప్రశ్న

ఒకే పారా ఒలింపిక్స్ లో బహుళ పతకాలు సాధించిన మొదటి భారత మహిళ ఎవరు? 

అవనీ లేఖరా, 

దీపా మాలిక, 

అంజలీ భగవత్, 

భవీనా పటేల్.

జ: అవనీ లేఖరా 


రూ.25,00,000 ప్రశ్న

2020లో ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఏ పదం, ఇటాలియన్‌ భాషలో '40 రోజులు' అని అర్థం వచ్చే ఒక పదం నుండి వచ్చింది?

లాక్‌డౌన్‌

ఐసోలేషన్‌

క్వారంటైన్‌

పాండమిక్

ఈ ప్రశ్నకు చాలాసేపు ఆలోచించిన రాజారవీంద్ర మరో లైఫ్‌ లైన్‌ను ఉపయోగించుకుని క్వారంటైన్‌ అని సరైన సమాధానం చెప్పాడు. దీంతో 50 లక్షల రూపాయల ప్రశ్నకు చేరుకున్నారు.


50లక్షల ప్రశ్న

జాతీయ వైద్యుల దినోత్సవం ఏ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మరియు వైద్యుడు అయిన ఒక వ్యక్తి జ్ఞాపకార్థం జరుపుతారు?

మిజోరాం

పశ్చిమబెంగాల్‌

ఉత్తరప్రదేశ్‌

కేరళ

ఈ ప్రశ్నకు కొద్దిసేపు ఆలోచించి ఆప్షన్‌ బీ, పశ్చిమ బెంగాల్ అంటూ కాన్ఫిడెంట్‌గా సరైన సమాధానం చెప్పారు. ఇప్పుడు కోటి రూపాయల ప్రశ్న. ఎవరు మీలో కోటీశ్వరులు చరిత్రలోనే ఇద్దరు మాత్రమే కోటి రూపాయల ప్రశ్నను చూశారు. వారిలో ఒకరు సెకండ్‌ సీజన్‌లో అయితే.. ఇప్పడు రాజారవీంద్ర మాత్రమే. 


ఇక కోటి రూపాయల ప్రశ్నను పరిశీలిస్తే.. 

1956 రాష్ట్రాల పునర్విభజన చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ అవతరణకు కారణమైన కమిషన్‌కు, ఎవరు అధ్యక్షత వహించారు?

రంగనాథ్‌ మిశ్రా

రంజిత్‌సింగ్‌ సర్కారియా

బీపీ మండల్‌

ఫజల్‌ అలీ కమిషన్‌

ఈ ప్రశ్నకు చాలా సేపు థింక్‌ చేసి ఉన్న మరో లైఫ్‌ లైన్‌ ఉపయోగించుకొని ఆప్షన్‌ డీ,  ఫజల్‌ అలీ కమిషన్‌ అంటూ చాలా కాన్ఫిడెంట్‌గా సరైన సమాధానం చెప్పారు. దీంతో ఈఎమ్‌కే చరిత్రలోనే కోటి రూపాయలు గెలుచుకున్న తొలి వ్యక్తిగా రాజా రవీంద్ర నిలిచారు.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Telugu & English News Papers
Promotion Lists Softwares
FA & SA Marks Entry
SA-2 Key Papers More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top