పీఆర్సీ పూర్తి నివేదిక ఉద్యోగులకు ఇవ్వాలని అమరావతి జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. గురువారం బొప్పరాజు మీడియాతో మాట్లాడుతూ..11వ పీఆర్సీ కమిషన్ నివేదికను పట్టించుకోలేదన్నారు. అధికారులను కమిటీ వేసి నచ్చినట్టు నివేదిక ఇచ్చారని చెప్పారు. 14.39 పిట్‌మెంట్‌కు ఉద్యోగులు వ్యతిరేకమన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు హెచ్‌ఆర్ఏ, డీఏ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యూలరైజ్ చేయాలని కోరారు. అధికారుల నివేదిక తమకు ఆమోదయోగ్యం కాదని చెప్పారు. ఫిట్‌మెంట్‌పై సీఎం జగన్ దగ్గర తేల్చుకుంటామని బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.
0 comments:
Post a Comment