ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓమిక్రాన్ కలకలం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓమిక్రాన్ కలకలం రేపుతోంది. తాజాగా ఏపీలో తొలి ఓమిక్రాన్ కేసు నమోదైంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. విజయనగరం జిల్లాకు చెందిన వ్యక్తికి ఓమిక్రాన్ వేరియంట్ సోకినట్లు తెలిపింది.విజయనగరానికి చెందిన వ్యక్తి మొదట ఐర్లాండ్ నుండి ముంబైకి వచ్చాడు. అక్కడ కరోనా పరీక్షలు చేయగా.. అతడికి నెగెటివ్ వచ్చింది. ఆ తర్వాత అతడు ముంబై నుండి విశాఖపట్నం వచ్చాడు. విశాఖలో మరోసారి ఆర్టీపీసీఆర్ కరోనా టెస్ట్‌లు చేశారు. అనంతరం అతడి నమూనాలను సీసీఎంబీకి పంపించారు. ఈ పరీక్షల్లో అతడికి ఓమిక్రాన్ వేరియంట్ సోకిందని తేలింది. ఈ విషయం తెలియడంతో స్థానిక ప్రజల్లో భయాందోళన వాతావరణ నెలకొంది. స్థానిక ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమై బాధితుడిని ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారని తెలిసింది. కాగా ప్రజలు ఎలాంటి ఆందోళన చెందొద్దని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రజలందరూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, భౌతికదూరం పాటించాలని సూచించింది.
0 comments:
Post a Comment