ఏపీ పెన్షనర్లకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. వృద్దాప్య పెన్షన్ రూ. 2250 నుంచి రూ. 2500కు పెంచుతున్నట్లు ప్రకటించింది. కొత్త సంవత్సరం కానుకగా జనవరి 1, 2022 నుంచి ఇది అమలు కానుందని స్పష్టం చేసింది.
ఈ మేరకు కలెక్టర్లు, అధికారులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. కాగా, 2019 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వైఎస్ జగన్ పెన్షన్లను రూ. 3000లకు పెంచుతామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 61,72,964 మంది పెన్షనర్లు.. ప్రతీ నెలా పెన్షన్ తీసుకుంటున్నారు.
డిసెంబర్, జనవరి నెలల్లో కార్యక్రమాలు..
డిసెంబర్ 21న సంపూర్ణ గృహహక్కు పథకం అమలు..
డిసెంబర్ 28న ఈ ఏడాది ఏప్రిల్ తర్వాత చేపట్టిన వివిధ పథకాలు, కార్యక్రమాల కింద పొరపాటున మిగిలిపోయిన లబ్ధిదారులకు ప్రయోజనాల పంపిణీ..
జనవరి 1, 2022న పెన్షన్‌కానుక కింద పెన్షన్లు రూ.2,500కు పెంపు
జనరరి 9న ఈబీసీ నేస్తం అమలు. అగ్రవర్ణాల్లోని నిరుపేద మహిళలకు (45-60ఏళ్లు)3 ఏళ్లలో రూ.45వేలు.
జనవరిలోనే రైతు భరోసా(త్వరలోనే తేదీ ప్రకటన)
0 comments:
Post a Comment