కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎ స్)ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ చైర్మన్ కె.వెంకట్రామిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.
ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్(ఏపీసీ పీఎస్ఈఏ) ఉద్యోగులు సీపీఎస్ రద్దు కోరుతూ శుక్రవారం విజయవాడలోని శాతవాహన కళాశాల మైదానంలో సింహగర్జన పేరుతో సభ నిర్వహించారు. వెంకట్రామిరెడ్డితో పాటుగా ఏపీ అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంక టేశ్వర్లు, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల అసోసియేషన్ చైర్మన్ కేఆర్ సూర్యనారాయణ పాల్గొని ఉద్యోగుల ఆందోళనకు మద్దతు ప్రకటించారు.
ఏపీసీపీఎస్ ఈఏ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.అప్పలరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.పార్థసార థి, మీడియా కో-ఆర్డినేటర్ గంటా శ్రీనివాసరావు తదితరులు మాట్లాడుతూ సీపీఎస్ రద్దు చేసేంత వరకూ ఆందోళనలు చేస్తామన్నారు.
0 comments:
Post a Comment