PRC News: పీఆర్‌సీ పై సీఎం జగన్‌ త్వరలో నిర్ణయం: సీఎస్‌ సమీర్‌శర్మ

*పీఆర్‌సీపై సీఎం జగన్‌ త్వరలో నిర్ణయం: సీఎస్‌ సమీర్‌శర్మ

 *PRC Fitment -14.29%

*పీఆర్‌సీ నివేదికను వెబ్‌సైట్‌లో ఉంచుతాం: సీఎస్‌ సమీర్‌శర్మ

 PRC: పీఆర్‌సీపై కమిటీ నివేదికను సీఎంకు అందించామని సీఎస్‌ సమీర్ శర్మ వెల్లడిచారు. పీఆర్‌సీపై ముఖ్యమంత్రి త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన నివేదికను వెబ్‌సైట్‌లో ఉంచుతామన్నారు. ఫిట్‌మెంట్‌పై సీఎంకు 11 ప్రతిపాదనలు ఇచ్చామన్న సీఎస్‌.. ఇతర రాష్ట్రాలు ఇచ్చిన ఫిట్‌మెంట్‌ను పరిశీలించామని చెప్పారు. పీఆర్‌సీ, ఫిట్‌మెంట్‌ అంశాలపై సుదీర్ఘంగా చర్చించామని పేర్కొన్నారు. పీఆర్‌సీ అమలుతో రూ.8 వేల నుంచి 10 వేల కోట్ల అదనపు భారం పడనుందని వివరించారు.

'పీఆర్‌సీపై కమిటీ నివేదికను సీఎంకు అందించాం. పీఆర్‌సీపై సీఎం జగన్‌ త్వరలో నిర్ణయం తీసుకుంటారు. పీఆర్‌సీ నివేదికను వెబ్‌సైట్‌లో ఉంచుతాం. ఫిట్‌మెంట్‌పై సీఎంకు 11 ప్రతిపాదనలు ఇచ్చాం. పీఆర్‌సీ అమలుతో రూ.8 వేల నుంచి 10 వేల కోట్ల అదనపు భారం పడనుంది' - సమీర్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

పీఆర్సీపై సీఎస్‌ కమిటీ నివేదికలో ముఖ్యమైన అంశాలు

🙋‍♂️– ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్‌మెంట్‌ను సిఫార్సు చేసిన సీఎస్‌ కమిటీ

🙋‍♂️– 11వ వేతన సంఘం సిఫార్సులపై నివేదిక ఇచ్చిన సీఎస్‌ కమిటీ

🙋‍♂️– రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై పలు అంశాలను నివేదికలో ప్రస్తావించిన సీఎస్‌ కమిటీ

🙋‍♂️– ఇన్ని ఇబ్బందులు ఉన్నా.. ఉద్యోగుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలను నివేదికలో ప్రస్తావించిన సీఎస్‌ కమిటీ

🙋‍♂️– 2018–19లో ఉద్యోగులకు జీతాలు, పెన్షన్ల రూపేణా చేసిన వ్యయం రూ. 52,513 కోట్లు కాగా, 2020–21 నాటికి ఆ వ్యయం రూ. 67,340 కోట్లకు చేరుకుంది. 

🙋‍♂️– 2018 –19లో రాష్ట్ర ప్రభుత్వం సొంత ఆదాయం (ఎస్‌ఓఆర్‌)లో ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల మొత్తం 84 శాతం అయితే, 2020–21 నాటికి అది 111 శాతానికి చేరుకుంది. 

🙋‍♂️– ప్రభుత్వ మొత్తం వ్యయంలో ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల కోసం చేస్తున్న వ్యయం 2018–19లో 32 శాతం అయితే, 2020–21 నాటికి 36 శాతానికి పెరిగింది. 

🙋‍♂️– ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఈ వ్యయం ఏపీలోనే అధికం. 2020–21లో తెలంగాణాలో ఇది కేవలం 21 శాతమే. ఛత్తీస్‌గఢ్‌లో 32 శాతం, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌లో 31 శాతం, ఒడిశా 29శాతం, మధ్యప్రదేశ్‌ 28 శాతం, హరియాణ 23 శాతం

నివేదికలోని కీలక అంశాలు:

🙋‍♂️– రాష్ట్ర విభజన అనేది రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై పెను ప్రభావం చూపింది

🙋‍♂️– తెలంగాణలో సగటు తలసరి ఆదాయం రూ.2,37,632 కాగా, ఏపీలో అది కేవలం రూ. 1,70,215 మాత్రమే.

🙋‍♂️– రూ. 6,284 కోట్ల విద్యుత్‌ బకాయిలు ఇంకా తెలంగాణ నుంచి రావాల్సి ఉంది

🙋‍♂️– రెవిన్యూ లోటు కింద ఉన్న రూ. 18,969.26 కోట్లు ఇంకా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది.

🙋‍♂️– కోవిడ్‌ –19 కారణంగా ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది

🙋‍♂️– కోవిడ్‌ కారణంగా రూ.20 వేల కోట్ల అదనపు భారం పడింది

🙋‍♂️– ఇంతటి కష్టాల్లో కూడా ప్రభుత్వం ఉద్యోగుల ప్రయోజనాలకోసం అనేక నిర్ణయాలు తీసుకుంది.

🙋‍♂️– జులై 1, 2019 నుంచి 27శాతం ఐఆర్‌ను ఇచ్చింది

– ఐ.ఆర్‌. రూపేణా ఉద్యోగులకు రూ.11,270.21 కోట్లు, పెన్షనర్లకు రూ. 4,569.78 కోట్లు, మొత్తంగా రూ. 15.839.99 కోట్లు చెల్లించింది.

🙋‍♂️– అంగన్‌వాడీ, ఆశావర్కర్లు సహా వివిధ కేటగిరీలకు చెందిన ఉద్యోగులకు ప్రభుత్వం వేతనాలు పెంచింది.

🙋‍♂️– 3,01,021 ఉద్యోగులకు ఈ ప్రభుత్వం జీతాలు పెంచింది. తద్వారా ఏడాదికి వీరికి జీతాల రూపంలో ప్రభుత్వం చేస్తున్న ఖర్చు రూ.1,198 కోట్ల నుంచి రూ.3,187 కోట్లుకు పెరిగింది.

🙋‍♂️– కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమం టైం స్కేలు సహా ఇతర ప్రయోజనాలను ఈ ప్రభుత్వం అందించింది.

🙋‍♂️– ప్రభుత్వ డిపార్ట్‌మెంట్లు, యూనివర్శిటీలు, సొసైటీలు, కేజీవీబీ, మోడల్‌ స్కూళ్లు తదితర ఉద్యోగులకు వర్తింపు చేసింది.

🙋‍♂️– ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ. 5 లక్షల రూపాయలు, సహజ మరణానికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా కూడా వీరికి అమలు చేస్తోంది.

🙋‍♂️– ఈ చర్యల వల్ల ప్రభుత్వంపై రూ. 360 కోట్ల మేర ఏడాదికి ప్రభుత్వంపై భారం పడుతోది. 

🙋‍♂️– ఏపీఎస్‌ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసింది.

🙋‍♂️– దీని వల్ల 2020 నుంచి జనవరి నుంచి ఆ సంస్థ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులగా మారారు.

🙋‍♂️– జనవరి 2020 నుంచి అక్టోబరు 2021 వరకూ రూ.5,380 కోట్ల భారం ప్రభుత్వంపై పడింది.

🙋‍♂️– పరిపాలనా సంస్కరణల్లో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ప్రభుత్వం తీసుకు వచ్చింది. 

🙋‍♂️– 1.28 లక్షల మంది శాశ్వత ఉద్యోగులను తీసుకుంది. 

🙋‍♂️– ఏడాదికి రూ. 2,300 కోట్ల భారం ప్రభుత్వంపై పడింది.

🙋‍♂️– ఆరోగ్య రంగంలో డాక్టర్లు, నర్సులు, పారామెడికల్‌ తదితర సిబ్బందిని భారీగా నియమించాం.

🙋‍♂️– దీనివల్ల అదనంగా ఏడాదికి రూ.820 కోట్ల భారం ప్రభుత్వ ఖజానాపై పడింది.

🙋‍♂️– అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల ప్రారంభించింది.

🙋‍♂️– మధ్యవర్తులు లేకుండా నేరుగా వారి బ్యాంకు ఖాతాలకే జీతాలను జమ చేస్తోంది.

🙋‍♂️– ఈపీఎఫ్‌ మరియు ఈఎస్‌ఐ వంటి సదుపాయాలను కల్పించింది. 

🙋‍♂️– అప్కాస్‌ రూపంలో ఏడాదికి ప్రభుత్వంపై రూ. 2,040 కోట్ల భారం పడుతోంది.

🙋‍♂️– ఎంపీడీఓలకు ప్రమోషనల్‌ ఛానల్‌ అంశాన్ని ఈ ప్రభుత్వం పరిష్కరించింది. 

🙋‍♂️– గ్రేడ్‌–1 వీఆర్వోలకు ప్రమోషన్‌ ఛానల్‌ను ఏర్పాటు చేసింది.

🙋‍♂️– రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 3,795 వీఆర్వో, వీఆర్‌ఏ పోçస్టుల భర్తీకి ఆదేశాలు ఇచ్చింది.

🙋‍♂️– మహిళా ఉద్యోగులకు ఏటా అదనంగా ఐదు రోజుల పాటు ప్రత్యేకంగా సెలవులు మంజూరు చేసింది.

🙋‍♂️– రీలొకేట్‌ అయిన ఉద్యోగులకు 30శాతం హెచ్‌ఆర్‌ఐ చెల్లిస్తోంది.

11th PRC Report Download

11th PRC Report Telugu Download

PRC CS Press Meet

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Capacity Building Training & Registration Links
Telugu & English News Papers
Ammavodi Eligibility Lists
FA & SA Marks Entry
Read Along App and May 2021 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top