ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (ap govt) 10 జాతీయ బ్యాంకుల (national banks) నుంచి దాదాపు రూ.57,479 కోట్లు అప్పు చేసిందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాడ్ (bhagwat karad) రాజ్యసభలో (rajya sabha) వెల్లడించారు. టీడీపీ (tdp) ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ (kanakamedala ravindra kumar) అడిగిన ప్రశ్నకు ఈమేరకు కేంద్రమంత్రి సమాధానమిచ్చారు. ఏపీలోని 40 ప్రభుత్వ కార్పొరేషన్లు, కంపెనీలకు జాతీయ బ్యాంకులు నేరుగా రుణాలు మంజూరు చేశాయని, అసలు, వడ్డీ చెల్లింపు బాధ్యత కార్పొరేషన్లు, కంపెనీలదేనని స్పష్టం చేశారు. 2019 నుంచి 2021 నవంబరు వరకూ జాతీయ బ్యాంకులు ఈ రుణాలు ఇచ్చినట్లు కేంద్రం తెలిపింది.
ఏ బ్యాంకు ఎంత అప్పు తీసుకుందంటే..?
* ఎస్‌బీఐ నుంచి 9 సంస్థలు రూ.11,937 కోట్లు రుణం పొందాయి.
* బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి ఐదు కంపెనీలు, కార్పొరేషన్లకు రూ.10,865 కోట్లు
* బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 3 సంస్థలకు రూ.7వేల కోట్లు
* బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి నాలుగు సంస్థలకు రూ.2,970 కోట్లు
* కెనరా బ్యాంకు నుంచి రూ.4,099 కోట్లు,
* పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ నుంచి రూ.750 కోట్లు
* ఇండియన్ బ్యాంక్ నుంచి రూ.5,500కోట్లు
* ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంక్ నుంచి రూ.1,750కోట్లు
* పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి రూ.5,633 కోట్లు
* యూనియన్ బ్యాంకు నుంచి రూ.6,975 కోట్లు
0 comments:
Post a Comment