పీఆర్సీపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కీలక ప్రకటన
పీఆర్సీపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. తిరుపతి సరస్వతీ నగర్‌లో ఉద్యోగుల తరపున కొందరు ప్రతినిధులు సీఎం జగన్‌ను కలిసి పీఆర్సీపై విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పీఆర్సీ ప్రక్రియ పూర్తయిందని, పదిరోజుల్లో ప్రకటన చేస్తామని సీఎం జగన్ అన్నారు. ఈ మేరకు ఉద్యోగ సంఘాలకు హామీ ఇచ్చారు.
ఈ రోజున పిఆర్సి పై చర్చించేందుకు కౌన్సిల్లో ఉన్న సంఘాలకు మధ్యాహ్నం రెండు గంటలకు మీటింగ్ నిర్వహించనున్నారు. ఈ మీటింగు కు ముందే ముఖ్యమంత్రి గారు ఇలాంటి ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
పదిరోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామన్న సీఎం జగన్ వ్యాఖ్యలపై ఏపీ జేఏసీ అధ్యక్షుడు బండి శ్రీనివాస్ స్పందించారు. సీఎం ప్రకటనను స్వాగతిస్తున్నామన్న బండి.. తాము ఇచ్చిన 71 డిమాండ్లలో ముఖ్యంగా పీఆర్సీ, సీపీఎస్ రద్దు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ వంటి సమస్యలను ఎలా పరిష్కరిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ నివేదకను వెంటనే బయటపెట్టాలని కోరారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో సరైన సమాధానం రాకుంటే తమ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు.
పీఆర్సీపై సీఎం ప్రకటనపై హర్షించదగ్గ విషయమన్న అమరావతి జేఏసీ నేత బొప్పరాజు తెలిపారు. తమను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా పీఆర్సీ నివేదికను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. సీఎం చెప్పిన మాట ప్రకారం ఉన్నతాధికారులు వెంటనే నివేదిక ఇవ్వాలన్నారు. అన్ని డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇస్తేనే ఉద్యమాన్ని విరమిస్తామని స్పష్టం చేశారు.
0 comments:
Post a Comment