LIC | ఒకేసారి పెట్టుబడి జీవితమంతా పింఛను


LIC | ఒకేసారి పెట్టుబడి జీవితమంతా పింఛను

ఒకేసారి పెట్టుబడి పెట్టి, జీవితాంతం వరకూ పింఛను పొందే వీలు కల్పించేలా భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) కొత్త పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త ఎల్‌ఐసీ సరళ్‌ పెన్షన్‌ పథకం ఇమ్మీడియట్‌ యాన్యుటీ విభాగంలోకి వస్తుంది. ఈ పథకాన్ని కొనుగోలు చేసినప్పుడే ఎంత పింఛను వస్తుందనేది తెలిసిపోతుంది. 

ఈ పాలసీ కింద రెండు రకాల ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. జీవితాంతం వరకూ పింఛను పొందిన పాలసీదారుడి తదనంతరం పూర్తి మొత్తం నామినీలకు అందుతుంది. ఉమ్మడిగా తీసుకునే జాయింట్‌ లైఫ్‌ ఆప్షన్‌లో పాలసీదారుడి తర్వాత.. జీవిత భాగస్వామికి పింఛను అందుతుంది. ఇద్దరూ మరణించిన తర్వాత వారి వారసులు ఆ పెట్టుబడి మొత్తాన్ని తీసుకోవచ్చు. ఒకసారి ఈ పథకాన్ని తీసుకున్న తర్వాత ఆప్షన్లను మార్చడం కుదరదు.

40 ఏళ్లు పూర్తయిన వారు.80 ఏళ్లలోపు వారు ఈ పాలసీలో చేరేందుకు అర్హులు. నెలకు కనీసం రూ.1,000, ఏడాదికి రూ.12,000 వరకూ కనీస పింఛను వచ్చేలా యాన్యుటీని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. గరిష్ఠంగా ఎలాంటి పరిమితి లేదు. యాన్యుటీ తీసుకున్న ఆరు నెలల నుంచి పాలసీదారుడు.. లేదా అతనిపైఆధారపడిన వారు తీవ్ర అనారోగ్యం బారిన పడినప్పుడు.. దీన్ని స్వాధీనం చేయొచ్చు. దీనికి కొన్ని నిబంధనల మేరకు అంగీకరిస్తారు. ఆరు నెలల తర్వాత కొంత రుణం తీసుకునే వీలుంది. 60 ఏళ్ల వ్యక్తి రూ.10లక్షలతో యాన్యుటీ కొనుగోలు చేస్తే..ఆప్షన్‌ 1లో ఏడాదికి రూ.51,650 పింఛను అందుతుంది. ఆప్షన్‌ 2లో రూ.51,150 ఇస్తారు. ఆన్‌లైన్‌లో ఈ యాన్యుటీని కొనుగోలు చేసిన వారికి ప్రత్యేక ప్రోత్సాహకాన్నీ ఎల్‌ఐసీ ప్రకటించింది.

12300 వార్షిక పెన్షన్

ఎల్‌ఐసి వెబ్‌సైట్‌లో లభ్యమయ్యే కాలిక్యులేటర్ ప్రకారం.. పాలసీదారుడికి 41 సంవత్సరాలు జీవన్ సరల్ కింద 100% యాన్యుటీ ఆప్షన్‌ను ఎంచుకుని రూ .3 లక్షలు జమ చేస్తే ప్రతి సంవత్సరం రూ.14760 జీవితకాలానికి పెన్షన్‌గా అందుతుంది. అర్ధ వార్షిక పెన్షన్ 7275 రూపాయలు, త్రైమాసిక పెన్షన్ 3608 రూపాయలు, నెలవారీ పెన్షన్ 1195 రూపాయలు. ఈ కాలిక్యులేటర్ ప్రకారం కనీసం రూ .2 లక్షల 40 వేలు సరల్ పెన్షన్ పథకంలో జమ చేయాల్సి ఉంటుంది. 41 సంవత్సరాల పాలసీదారుడు రూ .2.5 లక్షలు జమ చేస్తే అతని వార్షిక పెన్షన్ రూ.12300 అవుతుంది.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top