ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్లతో ఆకట్టుకునే వాట్సాప్.. మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ ప్రవేశపెట్టేందుకు ప్లాన్ చేస్తోంది. రాబోయే ఈ కొత్త ఫీచర్.. వాట్సాప్ గ్రూపు అడ్మిన్లకు మరింత పవర్ అందించనుంది. నివేదికల ప్రకారం.. గ్రూపు చాట్లపై వాట్సాప్ టెస్టింగ్ చేస్తోంది
. అదే.. డిలీట్ మెసేజెస్ ఫర్ ఎవ్రీవన్ (Delete messages for Everyone) ఫీచర్.. ఈ ఫీచర్ ద్వారా గ్రూప్‌లోని ప్రతి ఒక్కరికీ మెసేజ్‌లను ఆ గ్రూపు అడ్మిన్లు డిలీట్ చేసేందుకు అనుమతినిస్తుంది. అంటే.. గ్రూప్ అడ్మిన్ గ్రూపు చాట్‌లోని మెసేజ్ పై చర్యలు తీసుకోవచ్చు. అడ్మిన్ ఆ మెసేజ్ ఉంచవచ్చు లేదంటే డిలీట్ చేయొచ్చు.
Wabetainfo నివేదిల ప్రకారం.. WhatsApp కొత్త 2.22.1.1 అప్‌డేట్‌ను రిలీజ్ చేసింది. గ్రూప్ అడ్మిన్‌లు గ్రూప్‌లోని ప్రతి ఒక్కరికీ మెసేజ్ డిలీట్ చేయడానికి ఈ ఫీచర్ అనుమతినిస్తుంది. వ్యక్తిగత చాట్ లేదా గ్రూపు చాట్ బాక్సులో ఏదైనా మెసేజ్ డిలీట్ చేస్తే.. అక్కడ మెసేజ్ డిలీట్ చేసినట్టు ఒక మెసేజ్ కనిపిస్తుంది. అలాగే గ్రూపు అడ్మిన్లు డిలీట్ చేసిన మెసేజ్ దగ్గర కూడా removed by an admin అనే మెసేజ్ కనిపిస్తుంది. అయితే ఆ గ్రూపులో ఎంతమంది అడ్మిన్లు ఉన్నారు అనేది అవసరం లేదు. ఏ అడ్మిన్ అయినా మెసేజ్ డిలీట్ చేయొచ్చు. ఎవరూ చేసినా అడ్మిన్ డిలీట్ చేసినట్టుగానే మెసేజ్ డిస్ ప్లే అవుతుంది. వాట్సాప్ ఈ కొత్త ఫీచర్ ను బీటా వెర్షన్లలో టెస్టింగ్ చేస్తోంది. దీనికి సంబంధించి ఒక స్ర్కీన్ షీట్ నివేదిక రిలీజ్ చేసింది. గ్రూప్‌లో ఎంత మంది అడ్మిన్‌లు ఉన్నప్పటికీ.. ప్రతి ఒక్కరికీ మెసేజ్‌లను తొలగించే అధికారం వారందరికీ ఉంటుందని నివేదిక పేర్కొంది. బీటా టెస్టర్ల కోసం ఈ కొత్త ఫీచర్ ఇంకా అందుబాటులోకి రాలేదని నివేదిక వెల్లడించింది.
Whatsapp మెసేజ్ డిలీట్ చేయగల ప్రక్రియను అప్‌డేట్ చేస్తోంది. గ్రూప్ అడ్మిన్‌లు గ్రూప్‌లో పంపిన ఏదైనా మెసేజ్ డిలీట్ చేయగలరు. ఈ ఫీచర్ ద్వారా ఫీచర్ అప్‌డేట్‌లో వాట్సాప్ గ్రూప్‌లను మోడరేట్ చేయడానికి గ్రూప్ అడ్మిన్‌లకు మరింత పవర్ అందించనందని నివేదిక పేర్కొంది. వాట్సాప్ ఈ కొత్త ఫీచర్ ఎప్పటిలోగా అందుబాటులోకి తీసుకొస్తుందనేది క్లారిటీ ఇవ్వలేదు. వాట్సాప్ ఈ కొత్త ఫీచర్ ప్రవేశపెట్టడం ద్వారా గ్రూపు అడ్మిన్లు తమ గ్రూపులో ఏదైనా అసభ్యకరమైన లేదా అభ్యంతరకరమైన మెసేజ్ లను తొలగించడం ఈజీ అవుతుంది. గ్రూపులో అనవసరమైన మెసేజ్ లను తొలగించడంలో అడ్మిన్లకు మరింత సాయపడుతుందని నివేదిక తెలిపింది.
ఇటీవలే.. వాట్సాప్ ‘Delete Message for Everyone' ఫీచర్ టైమ్ లిమిట్ పొడిగించడంపై కసరత్తు చేస్తున్నట్లు నివేదికలు వెల్లడించాయి. ప్రస్తుతం వాట్సాప్ యూజర్లు ఒక గంట, 8 నిమిషాలు 16 సెకన్ల తర్వాత ఒకసారి పంపిన మెసేజ్ మాత్రమే తొలగించే అవకాశం ఉంది. త్వరలో యూజర్లు మెసేజ్‌లను పంపిన 7 రోజుల తర్వాత deleting messages for everyone డిలీట్ చేసే అవకాశాన్ని పొందుతారు.
వాట్సాప్ ఫీచర్స్ ట్రాకర్ (WhatsApp features tracker) Wabetainfo ప్రకారం.. WhatsApp ఫ్యూచర్ అప్‌డేట్‌లో టైమ్ లిమిట్ 7 రోజుల 8 నిమిషాలకు మార్చాలని యోచిస్తోంది. గతంలో WhatsApp టైం లిమిట్ బిట్‌ను ఎత్తేస్తుందని, యూజర్ల మెసేజ్‌లు పంపిన గంటలు, రోజులు, సంవత్సరాల తర్వాత కూడా ప్రతి ఒక్కరికీ డిలీట్ చేసే ఆప్షన్ అందుబాటులోకి తీసుకువస్తుందంటూ ఊహాగానాలు వినిపించాయి. కానీ వాట్సాప్ మాత్రం.. ప్రస్తుత టైమ్ లిమిట్ (Time Limit) తేదీని మాత్రమే సవరించాలని భావిస్తోంది.
0 comments:
Post a Comment