3 అంశాలను మంత్రుల కమిటీ ముందుంచిన పిఆర్సి సాధన కమిటీ:
మాది ఎంప్లాయ్ ఫ్రెండ్లీ ప్రభుత్వం ఒక్కరికి ఒక రూపాయి తగ్గకుండా చూస్తాం ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం.మూడు అంశాలను మంత్రుల కమిటీ ముందుంచిన పిఆర్సి సాధన కమిటీ. సజ్జల రామకృష్ణా రెడ్డి గారు మాట్లాడుతూ జీవోలు వెనక్కి తీసుకోవడం అంటే సరైన పద్ధతి కాదని ఏదైనా మార్పులు చేయాలంటే చర్చిద్దామని చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలి అని ఈ నెల 27వ తేదీన మరోసారి చర్చిద్దామని సాధన కమిటీ సభ్యులకు తెలియజేశారు ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఏమైనా అభ్యంతరాలు ఉంటే తొలగిస్తామని పేర్కొన్నారు.
మంత్రుల కమిటీ తో స్టీరింగ్ కమిటీ భేటీలో చర్చలకు రావాలంటే (27 వతేదికి)పెట్టిన షరతులు
*1) ఆశితోష్ కమిటీ రిపోర్ట్ విడుదల చేయ్యాలి
*2) జనవరికీ పాత జీతాలే ఇవ్వాలి
*3) PRC జివోలు రద్దుచేయాలి...
వీటికి ఒకే అయితేనే చర్చలకు మా నాయకులు వస్తారని మంత్రుల కమిటీ కి తెలిపిన స్టీరింగ్ కమిటీ నాయకులు
PRC జీవోను రద్దు చేయాలని కోరాం తదుపరి కార్యాచరణ కొనసాగుతుంది స్టీరింగ్ కమిటీ సభ్యులు
PRC Struggle Committee Representation
0 comments:
Post a Comment