ఏపీ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC). జాబ్ మేళా(Job Mela)

 ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు ఏపీ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) వరంలా మారింది. వరుసగా జాబ్ మేళా(Job Mela) లను నిర్వహిస్తూ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది.తాజాగా స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి పలు సంస్థల్లో ఖాళీల (Jobs) భర్తీకి సంబంధించి జాబ్ మేళాకు సంబంధించి ప్రకటన విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. విజయవంతంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 24న ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.

ఖాళీలు, విద్యార్హతల వివరాలు..

Kuraku Financial Services Pvt Ltd: ఈ సంస్థలో 150 ఖాళీలను భర్తీ చేయనున్నారు. కస్టమర్ సర్వీస్ ఎగ్గిక్యూటీవ్స్ విభాగంలో ఈ నియామకాలు చేపట్టారు. ఇంటర్/డిగ్రీ/బీటెక్/ఎంబీఏ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎంపికైన వారికి నెలకు రూ. 10 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. అభ్యర్థుల వయస్సు 18-35 ఏళ్లు ఉండాలి. అయితే కేవలం స్త్రీలు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఎంపికైన వారు విజయవాడలో పని చేయాల్సి ఉంటుంది.

Spencers Retail Store: ఈ సంస్థలో 25 ఖాళీలు ఉన్నాయి. టెలీకాలర్స్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. టెన్త్, ఆపై విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.10,500 వేల వేతనం చెల్లించనున్నారు. ఇంకా ఇన్సెంటీవ్స్ ఉంటాయి. ఎంపికైన వారు వైజాగ్ లో పని చేయాల్సి ఉంటుంది. అయితే కేవలం స్త్రీలు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారుఇతర వివరాలు:

-అభ్యర్థులు ముందుగా www.apssdc.in వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

-అనంతరం Resume, విద్యార్హతల జిరాక్స్ కాపీలు, ఆధార్ వెంట తీసుకురావాల్సి ఉంటుంది.

-ఇతర వివరాలకు 6301574739, 855832416 నంబర్ ను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.

-ఇంటర్వ్యూ వేధిక: అభ్యర్థులు Satya Degree & PG College, Near RTC Complex, Beside INOX, Thotapalem Road, Vizianagaram చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది.

Download Notification


Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top