ఉద్యోగుల ఉద్యమ కార్యాచరణపై నేతల భేటీ నేడు

ఉద్యోగుల ఉద్యమ భవిష్యత్తు కార్యాచరణపై ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి నేతలు సంయుక్తంగా సోమవారం భేటీ కానున్నారు. పీఆర్సీ అమలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు దాచుకున్న డబ్బుల చెల్లింపు, డీఏ బకాయిల విడుదల, సీపీఎస్‌ రద్దు తదితర సమస్యల పరిష్కారానికి ఇప్పటికే ఉద్యమం చేపట్టగా వాటన్నింటినీ పరిష్కరిస్తామన్న ప్రభుత్వ హామీతో గత నెల 17న దాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు నేతలు గుర్తు చేశారు. అయితే.. ఇప్పటికీ ఎలాంటి పరిష్కారం చూపకపోవడంవల్ల సోమవారం భేటీలో భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నట్లు ఏపీ జేఏసీ నేతలు బండి శ్రీనివాసరావు, హృదయరాజు, ఏపీ జేఏసీ అమరావతి నేతలు బొప్పరాజు, వైవీ రావు తెలిపారు. రెండు ఐకాసల సంయుక్త రాష్ట్ర సెక్రటేరియేట్‌ సమావేశం సోమవారం మధ్యాహ్నం విజయవాడలో నిర్వహించనున్నారు.

Press Note:

 AP JAC & AP JAC Amaravathi ఐక్య వేదిక

  తేదీ *2.1.2022* . 

   *ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఆహ్వానం* 

             ***  తేదీ.2.1.2022

ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విశ్రాంత, గ్రామ సచివాలయ, కాంట్రాక్ట్ & ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల 11వ PRC అమలు, ఉద్యోగ/ఉపాధ్యాయులు దాచుకున్న డబ్బులు చెల్లింపు, DA బకాయిల విడుదల, cps రద్దు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, తదితర సమస్యల పరిష్కారం కొరకు ఇప్పటికే ఉద్యమం మొదలుపెట్టి, ప్రభుత్వం వెంటనే పరిష్కరిస్తామని ఇచ్చిన హామీ మేరకు 17.12.2021న తాత్కాలికంగా ఉద్యమాన్ని వాయిదా వేసిన విషయం మీ అందరికీ తెలిసిందే.

అయితే నేటికి ప్రభుత్వం నుండి ఎలాంటి పరిష్కారం లభించనందున,  ఇరు JAC ల ఐక్య వేదిక తదుపరి చేపట్టబోయే భవిష్యత్ కార్యాచరణ గురించి *ఇరు JAC ల సంయుక్త రాష్ట్ర సెక్రటేరియట్ సమావేశము రేపు సాయింత్రం అనగా తేదీ 3.1.2022 సోమవారం మధ్యాహ్నం 3 గంటల* *నుండి జరుగును* . *అనంతరం అదే రోజు సాయంత్రం 6 గంటలకు విలేఖరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.* 

కావున తప్పకుండా మీ మీ ప్రింట్ మరియు & ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులను *తేదీ 3.1.2022 సోమవారం న సాయంత్రం 6 గంటలకు* NGO హోమ్, 3వ అంతస్తు, విజయవాడ నందు ఏర్పాటు చేసిన AP JAC & AP JAC Amaravathi సంయుక్త

పత్రికా (ప్రెస్ మీట్) సమావేశానికి హజరయ్యేటట్లు చూడగలరని కోరుచున్నాము. 

బండి శ్రీనివాసరావు & హృదయ రాజు, *AP JAC.* 

బొప్పరాజు & వైవీ రావు, *AP JAC అమరావతి.*

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Capacity Building Training & Registration Links
Telugu & English News Papers
Ammavodi Eligibility Lists
FA & SA Marks Entry
Read Along App and May 2021 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top