ఏపీ ఉద్యోగులు సమ్మె బాట పడుతారా ? అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఎస్ అనే సమాధానం వస్తోందిపీఆర్సీ విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వంపై కారాలు మిరియాలు నూరుతున్నారు. కొత్త పీఆర్సీ వద్దే వద్దు అంటున్నారు. వెంటనే ప్రభుత్వం ఇచ్చిన జీవోలను బేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తాము ప్రభుత్వంతో ఇక చర్చలకు వెళ్లేది లేదని..కార్యచరణేనంటూ కుండబద్ధలు కొట్టారు. 2022, జనవరి 19వ తేదీ బుధవారం ప్రభుత్వ జీవో కాపీలను దగ్ధం చేశారు.ఈనెల 21వ తేదీన ఏపీ జేఏసీ తరపున సీఎస్ కు సమ్మె నోటీసు ఇస్తామని, తమకు కొత్త పీఆర్సీ వద్దని బండి శ్రీనివాసరావు చెప్పారు. పీఆర్సీతో జీతం పెరుగుతుందని అబద్ధం చెబుతున్నారని, మూడు జీవోలను బేషరతుగా రద్దు చేయాలని మరోసారి డిమాండ్ చేశారు. సీఎం జగన్ తప్పుదోవ పట్టించారని కామెంట్స్ చేశారు. ప్రతి ఉద్యోగికి రూ. 6 వేల నుంచి రూ. 7 వేల వరకు ఉద్యోగి జేబుకు చిల్లు పడే పరిస్థితి ఉందన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment