చాలా వరకు సామాన్య జనం గుడువు తేదీని చివరి తేదీ అని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఐటీఆర్ ఫైలింగ్ కు సంబంధించి రెండు తేదీలు ఉంటాయి. ఒకటి గడువు తేదీ, మరొకటి చివరి తేదీ. ఒకవేళ మీరు గడువు తేదీ నాటికి మీ ఐటీఆర్ ఫైల్ చేయకపోతే.. చివరి తేదీ నాటికి మీరు ఐటీఆర్ ఫైల్ చేయవచ్చు. చివరి తేదీ 2022 మార్చి 31 వరకు అన్నమాట.
కానీ గడువు తేదీ నాటికి ఐటీఆర్ దాఖలు చేయకపోవడం వల్ల కొంత జరిమానా చెల్లించాల్సి వస్తుంది.
గడువు తేదీ తర్వాత ఐటీఆర్ దాఖలు చేసినందుకు ఆలస్య రుసుము కింద రూ.5,000 వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ.5 లక్షలకు లోపు ఉన్న పన్ను చెల్లింపుదారులు గడువు తేదీ తర్వాత ఐటీఆర్ దాఖలు చేస్తే(మార్చి 31, 2022 చివరి తేదీ లోపు) ఆలస్య రుసుము గరిష్టంగా రూ.1,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ.5 లక్షలకు పైగా ఉన్నట్లయితే, ఆలస్య రుసుము అనేది రూ.5 వేల వరకు ఉంటుంది.
0 comments:
Post a Comment