భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తాము: ఉద్యోగ సంఘాలు


భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తాము: ఉద్యోగ సంఘాలు

పీఆర్సీ విషయంలో ప్రభుత్వ వైఖరి పట్ల ఉద్యోగ సంఘాలు ఆగ్రహంగా ఉన్నాయా? ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవాలని నిర్ణయించాయా? తమ డిమాండ్ల సాధనకు ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేయనున్నాయా?అంటే, అవుననే సమాధానం వస్తోంది.

ఈ నెల 9న విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తామని, అదే రోజున భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామని ఏపీ జేఏసీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు అన్నారు. పీఆర్సీ నివేదిక ఇవ్వకుండా ప్రభుత్వం కేవలం సారాంశాన్ని మాత్రమే ఇచ్చిందని ఆయన చెప్పారు. సీఎస్ నివేదిక ప్రకారం అదనంగా జీతాలు రాకపోగా ఉన్న జీతాలకు కోత పడే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఇక చర్చలు ముఖ్యమంత్రితోనే తప్ప అధికారులతో అయ్యే పని కాదని తేలిపోయిందన్నారు. సంక్రాంతి పండుగ సమయంలో పెద్దఎత్తున ఒక కార్యక్రమం చేపట్టమని చాలామంది అడుగుతున్నారని శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వం నుంచి ఒక సమస్య కూడా పరిష్కారం కాలేదన్నారు. ఆర్ధిక మంత్రి, సీఎస్ ఇచ్చిన హామీలు నెరవేరలేదన్నారు. ప్రభుత్వంతో ఘర్షణను మేము కోరుకోవటం లేదన్న ఆయన ప్రభుత్వమే మా పట్ల వివక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. సచివాలయ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని సీఎం చెప్పిన మాటలను నిలబెట్టుకోవాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.

మావి గొంతెమ్మ కోరికలు కావు:

అధికారులు తమతో మొక్కుబడిగా సమావేశాలు నిర్వహించారని ఏపీ జేఏసీ అమరావతి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వంపై మండిపడ్డారు. కిందస్థాయి ఉద్యోగులను అవమానించే రీతిలో చర్చలు ఉన్నాయన్నారు. మేము దాచుకున్న డబ్బులు రూ.1600 కోట్లు రూ.2వేల కోట్లు అయ్యాయని చెప్పారు. ఈ బిల్లులు మార్చి లోగా చెల్లిస్తామనటం ఒక కుట్ర అని మండిపడ్డారు.మా కూలి డబ్బులనే మేము అడుగుతున్నామన్న ఆయన నాలుగు డీఏలు రావాల్సి ఉందన్నారు. సీపీఎస్ రద్దు హామీ ఇచ్చి కూడా ఇప్పుడు నోరు విప్పటం లేదన్నారు. సీపీఎస్ ఉద్యోగుల వేల కోట్ల రూపాయలు ఎటు వెళ్లాయో తెలియదన్నారు. ఉద్యోగులు గొంతెమ్మ కోరికలు కోరటం లేదని చెప్పారు. అధికారులు ముఖ్యమంత్రికి తప్పుడు సమాచారం ఇస్తున్నారని బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆరోపించారు. కాగా, పీఆర్సీ విషయంలో సీఎం జగన్ సానుకూలంగా స్పందిస్తారన్న నమ్మకం మాకు ఉందన్నారు బొప్పరాజు వెంకటేశ్వర్లు.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Telugu & English News Papers SSC Model Papers More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top