ఎపి సర్కార్‌ ఆదేశించినా మెజార్టీ ఆఫీసుల్లో హాజరు కాని సిబ్బంది

 ఎపి సర్కార్‌ ఆదేశించినా మెజార్టీ ఆఫీసుల్లో ట్రెజరీ సిబ్బంది హాజరుకాలేదు.కొన్ని ప్రాంతాల్లో మొత్తానికి సబ్‌ ట్రెజరీ కార్యాలయాలు తెరుచుకోలేదు. జిల్లా కేంద్రాల్లోని ట్రెజరీ కార్యాలయాల్లో 50 శాతం సిబ్బంది మాత్రమే హాజరయ్యారు. పోలీస్‌ శాఖ, కోర్టు సిబ్బంది వేతన బిల్లులను మాత్రమే ప్రస్తుతం అమలు చేస్తున్నారు.

జిల్లా ట్రెజరీ ఆఫీసులకు పోలీసు కార్యాలయం నుంచి వచ్చిన సాంకేతిక సిబ్బందితో అధికారులు బిల్లులు అమలు చేయిస్తున్నారు. పెన్షనర్ల బిల్లులను ఇప్పటికే అమలు చేశారు. అయితే సబ్‌ ట్రెజరీ కార్యాలయాల సిబ్బంది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో హాజరు కాబోమని స్పష్టం చేస్తూ కొన్ని కార్యాలయాలకు తాళాలు కూడా తీయలేదు.

కాగా కొత్త పీఆర్సీ అమలు విషయంలో ప్రభుత్వ ఆదేశాలు అమలు చేయని ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ హెచ్చరించారు. శనివారం సాయంత్రం 6గంటల్లోపు కొత్త పీఆర్సీ ప్రకారం ఉద్యోగుల వేతనాలు అమలు చేయాలని డెడ్‌లైన్‌ విధిస్తూ ఆయన ఉదయం ఒక మెమో జారీ చేశారు. డెడ్‌లైన్‌ లోపు తమ ఆదేశాలు పాటించని ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డీటీఏ, పీఏవో, జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. కొత్త పేస్కేళ్ల ప్రకారం వేతనాలు అమలు చేయాలంటూ నాలుగు రోజుల నుంచీ రావత్‌ నిత్యం మెమోలు జారీచేస్తున్నా మెజారిటీ డీడీవోలు, ఎస్టీవోలు ఖాతరు చేయడం లేదు. శనివారం వరకు 30శాతం వేతనాల బిల్లులు కూడా అమలు కాలేదు. దీంతో శనివారం ఏకంగా తీవ్రమైన హెచ్చరికలతో కూడిన మెమోలను రావత్‌ జారీ చేశారు. అయితే ప్రభుత్వ ఆదేశాలు అమలు చేయడానికి తమకు మరింత సమయం కావాలని కొందరు ట్రెజరీ అధికారులు కోరారు.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top