కోవిడ్‌ కేసులు పెరిగిన నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ సూచనలు


కోవిడ్‌ కేసులు పెరిగిన నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ సూచనలు:

రాష్ట్రంలో కోవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది.ఇందులో భాగంగా ఇటీవల ఒమిక్రాన్‌ వ్యాప్తి ఎక్కువవుతున్న నేపథ్యంలో తాజాగా అన్ని స్కూళ్లకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌.సురేష్‌కుమార్‌ పలు సూచనలు జారీ చేశారు. గతంలో జారీ చేసిన కోవిడ్‌ ప్రోటోకాల్‌ అంశాలను పాటిస్తూనే.. కొన్ని విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు.

సంక్రాంతి సెలవుల అనంతరం శానిటైజ్‌ చేయించడం, మాస్కులు తప్పనిసరి చేయడం వంటి చర్యలతో స్కూళ్లను పునఃప్రారంభించిన సంగతి తెలిసిందే. దీంతో తొలిరోజే 65 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు.

విద్య శాఖ జారీ చేసిన సూచనలు:

పాఠశాలల్లో ప్రార్థన కార్యక్రమం క్రీడలు కొనసాగించరాదు
విద్యార్థులు  భౌతిక దూరం పాటించాలి
స్కూల్ ఆవరణలో తరగతులు ఎప్పటికప్పుడు శానిటేషన్ చేయాలి


Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top