వేసవి సెలవుల్లోనే పాఠశాలలకు 'జగనన్న విద్యా కానుక' కిట్లు : విద్యాశాఖ మంత్రి సురేష్

 ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు మూడో విడత జగనన్న విద్యా కానుక కిట్లను వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే అందజేయాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు. ఇందుకు అవసరమైన టెండర్ల ప్రక్రియను త్వరగా పూర్తిచేసి ఏజెన్సీలకు వర్క్ ఆర్డర్లు జారీ చేయాలన్నారు. మంగళవారం సచివాలయంలో విద్యా శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రి సురేష్ మాట్లాడుతూ వేసవి సెలవుల్లోనే విద్యాకానుక కిట్లు పాఠశాలలకు చేరేలా చర్యలు చేపట్టాలన్నారు. జగనన్న అమ్మ ఒడి, విద్యాదీవెన పథకాలకు అర్హుల జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. నాడు నేడు పథకం కింద పాఠశాలల్లో మౌలిక వసతుల మెరుగుదల, క్రీడా ప్రాంగణాల అభివృద్ధి పనుల పురోగతిపై ఆరా తీశారు. విద్యా సంస్కరణలో భాగంగా తీసుకొస్తున్న ఫౌండేషన్ స్కూళ్ల అమలుకు ప్రభుత్వ పాఠశాలలు, టీచర్ల మ్యాపింగ్, హైస్కూళ్లలో ఉపాధ్యాయుల భర్తీపై చర్చించారు.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top